తొమ్మిది మందితో అయినా మ్యాచ్‌ ఆడిస్తరు

తొమ్మిది మందితో అయినా మ్యాచ్‌ ఆడిస్తరు

కరోనా నేపథ్యంలో  కోచింగ్‌‌‌‌ స్టాఫ్‌‌ మెంబర్స్‌‌ సబ్‌‌స్టిట్యూట్స్‌‌గా రావొచ్చు

దుబాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేదికగా మార్చి 4 నుంచి జరిగే విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వన్డే వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎలాంటి అంతరాయం లేకుండా నిర్వహించాలని ఐసీసీ భావిస్తోంది. టోర్నీలో పాల్గొనే టీమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కరోనా ఎఫెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పడితే చెరో తొమ్మిది మందితో అయినా  మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు కొనసాగించాలని డిసైడైంది.  నైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–ఎ–సైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గేమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మొన్నటి అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌19 వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే ఐసీసీ తమ ప్లేయింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కండీషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేర్చింది. దీన్ని విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టోర్నీలోనూ కొనసాగించనున్నారు. ఒకవేళ ఏ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అయినా ప్లేయర్లు కరోనా బారిన పడితే తొమ్మిది మందితోనే మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆడే అవకాశం కల్పిస్తామని ఐసీసీ ఈవెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్రిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెట్లే తెలిపారు. మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లు అందుబాటులో లేకుంటే  ఆ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కోచింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని  విమెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెంబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వచ్చే అవకాశం ఇస్తామన్నారు. నాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఇద్దరిని అనుమతించి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జరిగేలా చూస్తామని చెప్పారు. అవసరం అయితే మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను రీషెడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసే అవకాశం కూడా ఉందన్నారు. కరోనా నేపథ్యంలో ఈ టోర్నీలో అన్ని దేశాలకు15 మందితో కూడిన మెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు అదనంగా ముగ్గురు రిజర్వ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లకు అనుమతి ఇచ్చారు. కరోనా ఎఫెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయితే రిజర్వ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లను మెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి తీసుకోవచ్చు.