టీఆర్​ఎస్​కు ఓటేయాలని మంత్రి తీర్మానాలు

టీఆర్​ఎస్​కు ఓటేయాలని మంత్రి తీర్మానాలు

హుజూరాబాద్, వెలుగు: హుజూరాబాద్​ బైఎలక్షన్​లో టీఆర్​ఎస్​ అభ్యర్థికి ఓటేయాలని మంత్రి గంగుల కమలాకర్​ టాక్సీ డ్రైవర్, క్లాత్ మర్చంట్​ అసోసియేషన్లు, వడ్డెర సంఘం ప్రతినిధులతో తీర్మాన పత్రాలు రాయించుకున్నారు. హుజూరాబాద్ సిటీ సెంట్రల్ హాల్​లో సోమవారం టాక్సీ డ్రైవర్, క్లాత్ మర్చంట్ ​అసోసియేషన్లు, వడ్డెర సంఘం ప్రతినిధులతో మంత్రి గంగుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ టల మంత్రి, ఎమ్మెల్యే పదవులకి రాజీనామా చేశాక హుజూరాబాద్ ని చూసి భయం, బాధ కలిగిందని చెప్పారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఏడేళ్లు మంత్రిగా పనిచేసిన ఈటల నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదని ఆరోపించారు. సొంత ప్రయోజనాలు చూసుకొని ఆస్తుల్ని పెంచుకున్నారని చెప్పారు. మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు సమస్యలపై ఎన్నోసార్లు వినతిపత్రాలు ఇచ్చినా కనీసం పట్టించుకోలేదని విమర్శించారు. ఇక నుంచి నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి చూపిస్తామని, అందులో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని 300 రోడ్లను బాగుచేస్తున్నట్లు వివరించారు. త్వరలోనే అర్హులందరికీ డబుల్ బెడ్​రూం ఇళ్లు వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. సిద్దిపేట, కరీంనగర్, సిరిసిల్లకు దీటుగా హుజూరాబాద్​ను తీర్చిదిద్దుతామన్నారు. అనంతరం  టీఆర్ఎస్​ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్​కు ఓటేస్తామని  రాయించుకున్న తీర్మాన పత్రాలను మంత్రి గంగుల కమలాకర్ స్వీకరించారు. స్థానిక మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, ఆటో, క్లాత్ మర్చంట్, వడ్డెర సంఘాల నేతలు, ప్రతినిధులు పాల్గొన్నారు.