సిద్ధిపేటలో కరోనా కట్టడికి విన్నూత ప్రయోగం

సిద్ధిపేటలో కరోనా కట్టడికి విన్నూత ప్రయోగం
సిద్దిపేట జిల్లాలో ఇప్పటి వరకు 240 కరోనాపాజిటివ్ కేసులు నమోదు కాగా ఆరుగురు చనిపోయారు. రోజురోజుకూ వైరస్ వ్యాప్తి ఎక్కువవుతోంది. అయితే కరోనా కట్టడి కి ప్రజలను సన్నద్ధం చేస్తూనే వారిలో రోగ నిరోధక శక్తిని పెంచాలని మంత్రి హరీశ్‌రావు భావించారు. ఇందులో భాగంగానే కషాయ కేంద్రాల పేరుతో వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. డాకర్ట్లసూచన మేరకు రోగ నిరోధక శక్తిని పెంచుకునే ఆహారాన్ని తీసుకోవడంతో పాటు కషాయం, వేడి నీళ్ళను తాగాలని ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు.
ఇమ్యూనిటీ పెంచాలనే..
సిద్దిపేట పట్టణంలో నాలుగు చోట్ల కషాయ కేంద్రాలను ఏర్పాటు చేసి ఉచితంగా అందిస్తున్నారు. వీటితో పాటు మరో నాలుగు చోట్లవేడి తాగునీటి సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఒక రూపాయి కాయిన్‌ బాక్సులో వేస్తే లీటరు గోరు వెచ్చని తాగునీరు  వచ్చేలా ఏర్పాటు చేశారు. పట్టణంలోని ముస్తాబాద్‌ చౌరస్తా, పాత బస్టాండ్‌‌‌‌ సర్కిల్, నర్సాపూర్ చౌరస్తా, మెయిన్ రోడ్డుల్లోఈ ఉచిత కషాయ కేంద్రాలతో పాటు గోరు వెచ్చని తాగునీటి సరఫరా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
తయారీ ఇలా..
అల్లం, మిరియాలు, లవంగాలు, దాల్చినచెక్క, పసుపును వేడి నీటిలో మరిగించి ఈ కషాయాన్ని తయారు చేస్తున్నారు. అయితే ప్రతి ఒక్కరూ ఇంట్లోకషాయాన్నితయారు చేసుకునే పరిస్థితులు  లేనందున ఉచితంగా వీటిని పంపిణీ చేయడానికి ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మంత్రి హరీశ్‌రావు వ్యక్తిగతంగా కషాయం తయారీకి అవసరమైన సామగ్రిని అందజేస్తుండగా పలు స్వచ్ఛంద సంస్థలు వీటి నిర్వహణను చూసుకుంటున్నాయి. నాలుగు రోజుల క్రితం ప్రారంభమైన ఈ కేంద్రాలకు మంచి స్పందన లభిస్తోంది. అలాగే ఈ సెంటర్లవద్దనే గోరు వెచ్చని నీటిని అందించే ఏర్పాట్లూ చేస్తున్నారు. ప్రతి రోజు గోరు వెచ్చని నీటిని తాగితే  గొంతులో ఉండే వైరస్ నశించే అవకాశంఉందని డాక్టర్లు చెబుతున్నారు.
ఉచితంగా ఆక్సిజన్..
మరో వైపు కరోనా బాధితులకు ఉచితంగా ఆక్సిజన్‌ను అందించడానికి ప్రత్యేకంగా తెలంగాణ సేవక్‌‌‌‌లు ముందుకువచ్చారు. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడే వారికి సిద్దిపేట తెలంగాణ సేవక్‌‌‌‌లు ఆక్సిజన్‌ సిలిండర్‌‌‌‌‌‌‌‌తో పాటు అవసరమైన కిట్‌ను ఉచితంగా అందిస్తున్నారు. కరోనా బాధితులు శ్వాస సంబంధిత సమస్యలు ఎదుర్కొనే అవకాశాలుండడంతో వారికి సహాయపడటం కోసం ఈ కార్యక్రమానికి శ్రీకారంచుట్టినట్టు వారు చెబుతున్నారు.