మెగా ఇంట వారసుడు రాకతో ఆ కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తోంది. ఇటీవల గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతులు కవల పిల్లలకు జన్మినిచ్చారు. దీంతో ఈ దంపతుల జీవితంలో మరో మధురమైన అధ్యాయం మొదలైంది. ఈ సందర్భంగా తమ మాతృత్వపు ప్రయాణంలోని అత్యంత వ్యక్తిగతమైన , భావోద్వేగపూరితమైన క్షణాలను ఈ దంపతులు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
జ్యోతిష్యుడు చెప్పిన ముహూర్తంలోనే..
ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో వారి పిల్లల పుట్టుక వెనుక ఉన్న ఆధ్యాత్మిక ,జ్యోతిష్య నేపథ్యాన్ని వివరించారు. పిల్లల రాక కోసం అత్యంత శుభప్రదమైన సమయాన్ని (జనవరి 31, రాత్రి 11:30 గంటల తర్వాత) ఎంపిక చేసినట్లు ప్రముఖ జ్యోతిష్యుడు మహేష్ బ్యాంగ్ తెలిపారు. వైద్యుల నైపుణ్యం, నర్సుల సేవలు, ఆధ్యాత్మిక గురువుల ఆశీస్సులు కలగలిసి ఈ ప్రయాణాన్ని ఎంతో అర్థవంతంగా మార్చేచేశాయని ఉపాసన పేర్కొన్నారు.
ముగ్గురు పిల్లలతో మెగా ఇంట సందడి
2023లో ఉపాసన జన్మించిన క్లిన్ కారా కొణిదెల తర్వాత, ఇప్పుడు కవలలు తోడవడంతో మెగా ఇంట సందడి నెలకొంది. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ముఖాల్లోని ఆనందం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా ఉపాసన భావోద్వేగంతో సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో చూసినప్పుడల్లా.. నా హృదయం నిండిపోతుంది. మా చుట్టూ ఉన్న ప్రేమ, బలం , సానుకూలతకు నేను కృతజ్ఞురాలిని. ప్రపంచవ్యాప్తంగా మా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది..
ఉపాసన భావోద్వేగ పోస్ట్ ..
అభిమానులు మా పిల్లలను ఎల్లప్పుడూ రక్షిస్తారని, వారి వ్యక్తిగత భద్రతను గౌరవిస్తారని నేను నమ్ముతున్నాను అని భావోద్వేగంగా ఈ పోస్ట్ లో ఉపాపన రాశారు. మా కుటుంబం నిజంగా ఆశీర్వదించబడింది. మాకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు కలగడం ఎంతో సంతోషంగా ఉంది. మా జీవితాల్లోని మహిళలే మాకు అతిపెద్ద బలం అని ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తన బిడ్డలకు అభిమానుల ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని , అలాగే వారి గోప్యతను గౌరవించాలని ఉపాసన విజ్ఞప్తి చేశారు.
