ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌ల్లో క్యూ తప్పదు

ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌ల్లో క్యూ తప్పదు
  • 2023 వరకు ఇదే పరిస్థితి
  •  క్రిసిల్ రిపోర్ట్‌‌ వార్నింగ్
  • నత్తనడకన ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌ల విస్తరణ

ముంబై: . ఈ క్యూలు 2023 వరకు కూడా ఇలానే కొనసాగుతాయని తాజా రిపోర్ట్ హెచ్చరించింది. ప్రస్తుతం నాలుగు అతిపెద్ద మెట్రో ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌ల్లో చేపట్టిన కెపాసిటీ విస్తరణ పనులు నత్తనడకన సాగుతుండటంతో, ఈ క్యూలు మరో మూడేళ్ల వరకు తప్పవని క్రిసిల్ రిపోర్ట్ చెప్పింది. రూ.38 వేల కోట్లతో ప్రభుత్వం ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌ల కెపాసిటీ విస్తరణ ప్రాజెక్టులు చేపట్టింది. న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌‌ వంటి నాలుగు అతిపెద్ద ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌ల్లో ఈ విస్తరణ చేపడుతోంది. ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌ల మొత్తం ట్రాఫిక్‌‌లో  సగానికి పైగా ట్రాఫిక్‌‌ ఈ 4 ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌ల నుంచే నమోదవుతోంది. ఇప్పటికే ఈ ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌లు తమ  కెపాసిటీకి మించి ఆపరేట్ చేస్తున్నాయని క్రిసిల్‌‌ రిపోర్టు పేర్కొంది. ఈ ఆపరేటింగ్‌‌ రేటు వచ్చే 12 నెలలు కూడా మరికొంత పెరిగే అవకాశం ఉందని క్రిసిల్ చెబుతోంది.

ఈ నాలుగు ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌ల కెపాసిటీ 2023 నాటికి క్యుములేటివ్‌‌గా 65 శాతం పెరిగి 22.8 కోట్లకు చేరుకుంటుందని క్రిసిల్ రిపోర్ట్ చెప్పింది. ప్రస్తుతం ఈ కెపాసిటీ 13.8 కోట్లుగా ఉంది. ట్రాఫిక్ కూడా ఏడాదికి 10 శాతం వరకు పెరుగుతుందని తెలిపింది. అదనంగా చేపడుతోన్న కెపాసిటీలు 2023 ఆర్థిక సంవత్సరం నుంచి దశల వారీగా అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. అప్పటి వరకు అత్యధికంగా నమోదవుతోన్న ప్యాసెంజర్ గ్రోత్‌‌తో రద్దీ సమస్యను ఎదుర్కోవాల్సిందేనని హెచ్చరించింది. చిన్న నగరాలకు ఎయిర్ కనెక్టివిటీని పెంచడం, రైలుకు, విమానానికి మధ్యనున్న ఛార్జీల తేడాను తగ్గించడంతో రద్దీని కాస్త తగ్గించవచ్చని సూచించింది. ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌ల్లో అందుబాటులో ఉంటోన్న అడ్వర్‌‌‌‌టైజింగ్, రెంటల్స్, ఫుడ్, బెవరేజ్, పార్కింగ్ వంటి వాటికి కస్టమర్లు కూడా పెరుగుతున్నారు. ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌ల రెవెన్యూల్లో సగం వీటివే ఉంటున్నాయి. ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌ల్లో అమల్లోకి రాబోతున్న కొత్త టారిఫ్ ఆర్డర్‌‌‌‌తో 2022–24 ఆర్థిక సంవత్సరాల్లో ఎయిరో రెవెన్యూ పెరిగే అవకాశం ఉందని క్రిసిల్ తెలిపింది. ‌‌