Realme కొత్త స్మార్ట్ ఫోన్ GT 6T మేలో లాంచ్..ఫీచర్లు,ధర ఫుల్ డిటెయిల్స్

Realme కొత్త స్మార్ట్ ఫోన్ GT 6T మేలో లాంచ్..ఫీచర్లు,ధర ఫుల్ డిటెయిల్స్

Realme..కొత్త స్మార్ట్ఫోన్ను విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తోంది. GT లైనప్ లో రెండు సంవత్సరాల తర్వాత భారతదేశంలో Realme GT 6T  స్మార్ట్ఫోన్ లాంచ్ చేసేందుకు సిద్దమైంది. ఈ విష యాన్ని X లో అధికారికంగా ప్రకటించింది. Realme GT 6T  కొత్త స్మార్ట్ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధర గురించి తెలుసుకుందాం.  

 ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7+ Gen 3 SoC ద్వారా పనిచేస్తుంది. Realme GT 6T అనేది Realme GT Neo 6 SE రీబ్రాండ్ గా మార్కెట్లోకి రానుంది.  ఈ కొత్త హ్యాండ్ సెట్ 8GB RAM + 256GB స్టోరేజ్ తో లభించనుంది. దీని ధర రూ. 18,000 ఉంటుందని అంచనా.

Realme GT Neo 6 SE Snapdragon 7+ Gen 3 SoC తో , 120Hz రిఫ్రెష్ రేట్, 6,00 nits బ్రైట్ నెస్ తో 6.78-అంగుళాల 8T LTPO AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ 50 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ , 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. ఇది 16GB RAM,512GB వరకు నిల్వను అందించే వేరియంట్ లో కూడా లభించనుంది. ఈ డివైజ్ 120W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు  సపోర్టు చేసే 5,500mAh పవర్ ఫుల్ బ్యాటరీని కలిగి ఉంటుంది. డస్ట్, వాటర్ ఫ్రూప్ బాడీ ఉంటుంది. 

  • Qualcomm Snapdragon 7+ Gen 3 SoCని కలిగి ఉన్న భారతదేశపు మొదటి ఫోన్ Realme GT 6T.
  • AnTuTu బెంచ్‌మార్క్ ప్లాట్‌ఫారంలో Realme GT 6T 1.5 మిలియన్ పాయింట్లకు పైగా స్కోర్ చేయగలదని బ్రాండ్ పేర్కొంది.
  • ఈ హ్యాండ్ సెట్ చిప్‌సెట్ అధునాతన 4nm TSMC ప్రాసెసర్‌పై నిర్మించబడింది. బెస్ట్ పెర్ఫార్మెన్స్, స్పీడ్ తో వినియోగదారులకు మంచి అనుభూతిని అందిస్తుంది. 
  • Snapdragon 7+ Gen 2తో పోల్చినప్పుడు, Realme GT 6Tలోని SD 7+ Gen 3 CPU పనితీరులో 15 శాతం పెరుగుదల GPU పవర్‌లో 45 శాతం బూస్ట్‌ను అందిస్తుంది.
  • ఖచ్చితమై డేట్ ప్రకటించకపోయినా ఈనెలలో (మే)నే కొత్త స్మార్ట్ ఫోన్ ను భారత్ లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.