సత్యదేవ్ హీరోగా డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో రూపొందిన చిత్రం ‘కృష్ణమ్మ’. వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించాడు. కృష్ణ కొమ్మలపాటి నిర్మించారు. శుక్రవారం సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ప్రెస్మీట్లో సత్యదేవ్ మాట్లాడుతూ ‘కథ వినగానే చాలా బాగా నచ్చింది. ఇలాంటి స్టోరీ ఇచ్చిన దర్శకుడు గోపాల్‌కు రుణపడి ఉంటాను. కొరటాల శివ గారు ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేనిది. కాల భైరవ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అవుతుంది. మండు వేసవిలో చల్లని ఎమోషన్స్‌తో సినిమా సాగుతుంది.
కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని కాన్ఫిడెంట్‌గా ఉన్నాం’ అని అన్నాడు. దర్శకుడు గోపాలకృష్ణ మాట్లాడుతూ ‘ఇందులో బెజవాడ పాలిటిక్స్ కానీ, రౌడీయిజం కానీ ఉండవు. ముగ్గురు స్నేహితుల కథ. కృష్ణా నదిలో ఎన్ని మలుపులు ఉన్నాయో, వీరి జీవితంలోనూ అన్ని మలుపులు ఉంటాయి’ అని చెప్పాడు. ఈ చిత్రం తమ కెరీర్‌కు హెల్ప్ అవుతుందని హీరోయిన్స్ అథిరా, అర్చన, నటుడు కృష్ణ బూరుగుల అన్నారు.