ఇంతకీ అసలు విషయం ఏంటంటే… ప్రేమ్ నగర్ పోలీస్‌స్టేషన్ సమీపాన మురికి వాడ ఉంది. ఆ మురికివాడల్లో ఉండే పిల్లలు ఈ పోలీస్ స్టేషన్‌కు వచ్చి చదువుకుంటున్నా రన్న-
మాట. అది సరే టీచర్లు పోలీసులేనా అని డౌట్ వచ్చిందా. ఫుల్ మ్ టీచర్లు కాక-
పోయినా… వాళ్లూ కలం పట్టి అక్షరాలు దిద్దిస్తారు. ఉదయం నుంచి సాయంత్రం
వరకు… మొత్తంగా ఆరు గంటలు క్లాసులు జరుగుతాయి ఇక్కడ. హిందీ, ఇంగ్లీష్,
మ్యాథ్స్, హిస్టరీ, జియోగ్రఫీ వంటి అన్ని
సబ్జెక్స్‌ట్ నేర్పిస్తారు. 
ఫుట్ పాత్ టు పోలీస్ స్టేషన్‘ఆస్రా ట్రస్ట్’ అనే ఎన్జీవో… మురి కివాడల్లో పిల్లలకు చదువు నేర్పించాలని ముందుకొచ్చింది. మొదట ఆ పిల్లలకు పోలీస్ స్టేషన్‌కు
ఎదురుగా ఉన్న ఫుట్‌పాత్ మీద పాఠాలు.చెప్పేవా రు ఈ ట్రస్ట్ వలంటీర్లు. వాళ్లను గమనించిన ఆ స్టేషన్ ఆఫీసర్ ముకేశ్ త్యాగి…‘మా స్టేషన్‌లోనే పిల్లలకు పాఠాలు చెప్పండి’అని వాళ్లని పిలిపించారు. అప్పట్నించి పోలీస్ స్టేషన్ అయితేనే సురక్షి-
తంగా ఉంటుందనుకున్నారో ఏమో. మిగతా తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను
చదువుల పోలీస్ స్టేషన్‌కు పంపడం మొదలుపెట్టారు. పదిమంది పిల్లలతో మొదలై… ఇప్పుడా సంఖ్య 51కి చేరింది. పోలీసుల అండ వలంటీర్లే కాదు… వీలున్నప్పుడల్లా పోలీసులు కూడా పిల్లలకు పాఠాలు చెబుతుంటారు. అలాగే స్టేషన్‌లోని స్టాఫ్, రెగ్యు లర్‌గా పిల్లలకు అరటిపండ్లు,
సమోసాలు, స్నాక్స్ తెచ్చి పెడుతుంటారు. ఇంకెవరో ముందుకొచ్చి ప్రతి నెలా అయిదు వేల రూపాయలు… వ్యాన్ కోసం స్పాన్సర్
చేస్తున్నారట. మరికొం దరు స్కూల్ బ్యాగ్స్,బుక్స్ కూడా డొనేట్ చేస్తున్నారు.
