పలు షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లు రూపొందించి 'గాయపడ్డ సింహం' చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు కశ్యప్ శ్రీనివాస్. తరుణ్ భాస్కర్ లీడ్‌గా నటించిన ఈ సినిమాను పవన్ సాధినేని సమర్పణలో, కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ భన్సల్ నిర్మించారు.
మే 1న సినిమా విడు దలవుతున్న సందర్భంగా దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ మాట్లాడుతూ 'ఇందులో తరుణ్ భాస్కర్ తన ప్రేమ కోసం అమెరికా వెళ్లి, అక్కడ డిపోర్టేషన్కు గురై మళ్లీ ఇండియాకు వస్తాడు. ఏ కారణం చేత తిరిగి వచ్చాడో, ఆ ప్రస్టేషన్తో తీసుకునే నిర్ణయాలు ఎంత ఫన్ క్రియేట్ చేశాయి అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. జేడీ చక్రవర్తి ధర్మపాత్రలో కనిపి స్తారు. సత్య లాజిస్టిక్స్ పేరుతో అక్రమ దందా చేసే పాత్ర.
తెలిసిన కథలాగే అనిపించినా, అందులో జరిగే సంఘటనలు ప్రేక్షకులు ఊహించలేరు. ఈ సినిమాలో ప్రతి పాత్ర కూడా హీరోగానే ఫీల్ అవుతుంది. మానస చౌదరి, ఫరియా అబ్దుల్లా పాత్రలు కొత్తగా ఉంటాయి. శుభలేఖ సుధాకర్ గారితో 'కేజీఎఫ్' స్టైల్ నేరేషన్ చెప్పించాం.
అది చాలా ఫన్గా వచ్చింది. ఇందులో డైలాగ్, విజువల్, యాక్షన్, సిచ్యుయేషనల్.. ఇలా అన్ని రకాల కామెడీ ఉంటుంది. ట్రంప్ రూపంలో ప్రమోషన్ చేయడం కామిక్ గా ఉంటుంది. చిన్న సినిమా అనుకుని మొద లుపెట్టాం. కానీ నిర్మాతలు కథకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో మంచి స్కేల్లో తీశారు' అని చెప్పాడు.

