తెలంగాణలో యువత బీజేపీ వైపే..

తెలంగాణలో యువత బీజేపీ వైపే..

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో యువతరం బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నట్టు సర్వేలో వెల్లడైంది. 44 ఏళ్లలోపు వారిలో మెజారిటీ యువత బీజేపీకి ఓటేసేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. నడి వయసువారు, వృద్ధుల్లో ఎక్కువ మంది టీఆర్ఎస్​కు అండదండగా ఉన్నారు. అయినా వారు బీజేపీ సెకండ్​ ప్లేస్ లో ఉండాలని కోరుకుంటున్నారు. 55 ఏళ్లు దాటినోళ్లు రెండో చాన్స్​ కాంగ్రెస్​కే అంటున్నరు.

  • రాష్ట్రవ్యాప్తంగా మహిళల కంటే పురుషులే ఎక్కువగా అధికార పార్టీని ఆదరిస్తున్నట్టు గుర్తించారు.
  • ఇంటర్, డిగ్రీ, ఆపైన చదువుకున్న ఉన్నత విద్యావంతుల్లో ఎక్కువ మంది బీజేపీని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఎలక్షన్లోస్తే కమలానికే ఓటేస్తామని సర్వేలో చెప్పారు. టెన్త్ లోపు చదివినోళ్లు, చదువుకోనివారు ఎక్కువగా టీఆర్ఎస్​కు జై కొట్టారు.
  • నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు, ఆర్టిజన్లు సర్కారుకు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నట్లు సర్వేలో తేలింది. వారిలో ఎక్కువగా బీజేపీ వైపే చూస్తున్నారు. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి, పెండింగ్​ హామీలే దీనికి కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
  •  కులాలు, సామాజిక వర్గాల వారీగా పార్టీల ఓటింగ్​శాతం ఆసక్తి రేపుతోంది. ప్రధానంగా బీసీలు ఎక్కువ మంది బీజేపీకి అండగా ఉన్నారు. ఎస్సీలు, ఇతర కులాలకు చెందిన మెజారిటీ ఓటర్లు టీఆర్ఎస్​కు జై కొట్టారు. రెడ్లు ఇరు పార్టీలను సమానంగా ఆదరిస్తున్న ట్రెండ్​ కనబడింది. ఇక ఎస్టీలు ఎక్కువగా కాంగ్రెస్ ​వైపు మొగ్గు చూపారు.