కేరళలో ఐస్​ క్రీం బాంబు పేలుడు

కేరళలో ఐస్​ క్రీం బాంబు పేలుడు

కేర‌ళ‌లో రెండు ఐస్ క్రీం బాంబులు పేలాయి. ఐస్ క్రీం షేప్‌లో ఉన్న కంటేన‌ర్‌తో చేసిన పేలుడు ప‌దార్ధాల‌ను ఐస్ క్రీం బాంబు అని పిలుస్తారు. క‌న్నౌరులోని అంచ‌ర్కాండిలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది.

 కేర‌ళ‌లో ఇవాళ ( మే 13) బాంబు పేలుడు ఘ‌ట‌న చోటుచేసుకుంది. క‌న్నౌరులోని అంచ‌ర్కాండిలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. తెల్లవారుజామున 3 గంట‌ల‌కు రోడ్డుపై వేసిన రెండు ఐస్‌క్రీమ్ బాంబులు(Ice Cream Bombs) పేలాయి. ఐస్ క్రీం షేప్‌లో ఉన్న కంటేన‌ర్‌తో చేసిన పేలుడు ప‌దార్ధాల‌ను ఐస్ క్రీం బాంబు అని పిలుస్తారు. అయితే ఆ బాంబు పేలుళ్లకు పాల్పడిన వ్యక్తుల‌ను అరెస్టు చేసేందుకు విచార‌ణాధికారులు వెళ్తున్నారు. ఇటీవ‌ల కాలం క‌న్నౌరులో సీపీఎం, బీజేపీ మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. స్థానికంగా ఓ ఆల‌యంలో భ‌క్తుల‌కు ఇచ్చిన కానుక‌ల అంశంలో రెండు పార్టీల మ‌ధ్య వివాదం న‌డ‌స్తున్నది. ఉద్రిక్తతల నేప‌థ్యంలో పోలీసుల ప‌హారా పెంచేశారు. పోలీసు క్యాంపున‌కు కొన్ని మీట‌ర్ల దూరంలోనే పేలుడు ఘ‌ట‌న జ‌రిగింది.