కొత్తగా మరో వెయ్యి కోట్లు అప్పు చేసిన రాష్ట్రం
హైదరాబాద్, వెలుగు: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ నుంచి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.15 వేల కోట్లకుపైగా అప్పులు చేసింది. అంటే నాలుగు నెలల వ్యవధిలోనే భారీగా అప్పులు తెచ్చింది. ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ సెక్యూరిటీ బాండ్లను వేలానికి పెట్టి ఈ మేరకు అప్పులు సమీకరించిం ది. కరోనాతో దేశంతో పాటు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థా దెబ్బతింది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు అప్పు తీసుకునే ఎఫ్ఆర్బీఎం పరిమితిని జీఎస్డీపీలో మూడు శాతం నుంచి ఐదు శాతానికి పెంచుకునేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ వెసులుబాటుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త అప్పులను సేకరిస్తోంది. ఇప్పటికే రూ.14,461 కోట్లను సేకరించిన ఆర్థిక శాఖ తాజాగా మరో రూ.వెయ్యి కోట్ల అప్పు తీసుకుంది.

