ఇండియా, అమెరికాల మధ్య సంబంధాలను పెంచడంతో భారత ప్రధాని మోడీకి ‘లెజియన్ ఆఫ్ మెరిట్’ అవార్డును అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ప్రధాని మోడీకి ఈ పురస్కారాన్ని ప్రకటిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. భారత్‌ను ప్రపంచశక్తిగా మార్చడం కోసం నాయకత్వం వహించినందుకు మోడీకి ఈ అవార్డును ఇస్తున్నట్లు ట్రంప్ అన్నారు. ప్రధాని మోడీ తరఫున ఈ అవార్డును అమెరికా భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రెయిన్ నుంచి వైట్‌హౌస్‌లో స్వీకరించారు. ప్రధాని మోడీకి తమ దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేసిన తాజా దేశంగా యునైటెడ్ స్టేట్స్ నిలిచింది.
అమెరికా-భారత వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంచడంలో నాయకత్వం వహించినందుకు అధ్యక్షుడు ట్రంప్ ‘లెజియన్ ఆఫ్ మెరిట్’ అవార్డును భారత ప్రధాని నరేంద్ర మోడీకి ప్రకటించారు. ఈ అవార్డును మోడీ తరపున భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు స్వీకరించారు’ అని ఓబ్రెయిన్ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.
పీఎం మోడీకి ఇచ్చిన ఈ అవార్డు రాష్ట్ర అధిపతికి లేదా ప్రభుత్వానికి మాత్రమే ఇవ్వబడుతుంది. ప్రపంచ శక్తిగా మారుతున్న భారతదేశం అభివృద్ధిని వేగవంతం చేస్తూ.. ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి అమెరికా మరియు భారతదేశం మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంచిన మోడీ స్థిరమైన నాయకత్వం మరియు దృష్టికి గుర్తింపుగా ఈ అవార్డు లభించింది.
మోడీకి ఇచ్చిన ఈ అవార్డును ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, జపాన్ మాజీ ప్రధాని షింజో అబేలకు కూడా ట్రంప్ ప్రకటించారని ఓబ్రియిన్ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ అవార్డులను వాషింగ్టన్ డీసీలోని ఆయా దేశాల రాయబారులు అందుకున్నారు. ఇండో-పసిఫిక్ కోసం షింజో చేస్తున్న కృషి మరియు ఆయన నాయకత్వాన్ని మెచ్చి ట్రంప్ లెజియన్ ఆఫ్ మెరిట్ అవార్డును జపాన్ ప్రధాన మంత్రి షింజో అబేకు ప్రదానం చేశారు. ప్రపంచ సవాళ్లను పరిష్కరించడంతో పాటు సామూహిక భద్రతను ప్రోత్సహించడంలో నాయకత్వం వహించినందుకు ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్‌కు ట్రంప్ లెజియన్ ఆఫ్ మెరిట్ అవార్డును ప్రదానం చేశారు.
For More News..
టాప్ 100లో చోటుదక్కించుకున్న యాక్టివిస్ట్ అనుమానాస్పద మృతి
అందుకే ఆయనకు ‘గుడిసెల వెంకటస్వామి’ అనే పేరొచ్చింది
వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు ఆధార్ తప్పనిసరి
