మరో 7శాతం క్షీణించిన రూపాయి మారకం విలువ

 మరో 7శాతం క్షీణించిన రూపాయి మారకం విలువ
  • స్వల్ప నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ సూచీలు

ముంబయి: దేశీయ స్టాక్ సూచీలు స్వల్ప నష్టాలతో ప్రారంభం కాగా.... రికార్డు స్థాయిలో రూపాయ విలువ పడిపోయింది. డాలరుతో రూపాయి మారకం విలువ 80.05కి చేరింది. ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు డాలరుతో పోలిస్తే.. రూపాయి మారకం విలువ 7 శాతం వరకు క్షీణించింది. నిన్న డాలర్ విలువ 80ని తాకినా.. 79.98 దగ్గర స్థిరపడింది. ఇవాళ మార్కెట్లు ప్రారంభం కాగానే.. 80.05కి చేరింది రూపాయి విలువ. జులై - సెప్టెంబర్ త్రైమాసికంలో డాలర్ మారకపు విలువ 82కి చేరొచ్చని... కొన్ని బ్రోకరేజీ సంస్థలు అంచనా వేస్తున్నాయి.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ముడిచమురు ధరలు పెరిగిపోవడం, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికవ్యవస్థ నెమ్మదించడం... రూపాయి విలువ బలహీనం కావడానికి కారణమని గతంలో తెలిపారు నిర్మలా సీతారామన్. బ్రిటిష్, జపాన్, యూరో కరెన్సీ విలువ పతనం కూడా రూపాయి కన్నా ఎక్కువగా ఉంది. ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు తరలిపోవడంతో.. రూపాయి విలువ తగ్గేందుకు కారణమయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ మార్కెట్ నుంచి 14 బిలియన్ డాలర్లను ఉపసంహరించుకున్నారు.