వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..

V6 Velugu Posted on Jul 22, 2020

ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఇద్దరి అరెస్టు

మహబూబాబాద్ అర్బన్, వెలుగు: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను చంపిన కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ నరేశ్ కుమార్ మంగళవారం తెలిపారు. కేసముద్రం మండలం తిమ్మపురంలో ఈ నెల 9న రాత్రి8గంటల ప్రాంతంలో మేకల ఉప్పలయ్య తన భార్య సునీతతో గొడవ పడి, తన వ్యవసాయ భూమి వద్దకు వెళ్లాడు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని, ఒంటరిగా ఉన్నది చూసిన సునీత, ప్రియుడి కాసోజు యాకంతా చారి అక్కడికి వెళ్లారు. ఉప్పలయ్యను కొట్టి, గొంతు నులిమి చంపి దగ్గరలో ఉన్న ముడావత్ శ్రీను వ్యవసాయ బావి ఒడ్డుపై చెట్ల పొదల్లోపడేసి వెళ్లారు.

ఉప్పలయ్య హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించాలని చూశారు. పోలీసుల దర్యాప్తులో సునీత, యాకంతాచారి కలిసి హత్య చేసినట్లు తేలింది. ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఆయన తెలిపారు. కేసును ఫాస్ట్ గా ఛేదించిన మహబూబాబాద్ రూరల్ సీఐ వెంకటరత్నం, కేసముద్రం ఎస్ ఐ సతీశ్ , కేసముద్రం సిబ్బంది రాఘవరావు, సంపత్, కుమారస్వామిని డీఎస్పీ అభినందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం..

Tagged murder, HUSBAND, Wife, Crime News, lover

Latest Videos

Subscribe Now

More News