గండిపేట, వెలుగు: గండిపేట్ మండలంలోని ఖానాపూర్ పోచమ్మ తల్లి దేవాలయంలో సోమవారం అర్ధరాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. హుండీ పగులగొట్టి రూ.20 వేలతో పాటు, అమ్మవారికి అలంకరించిన సుమారు రూ.5 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. చోరీ ఆనవాళ్లు దొరకకుండా సీసీటీవీ డీవీఆర్‌ను కూడా తీసుకెళ్లారు.
స్థానికుల ప్రమేయం ఉండొచ్చని ఆలయ కమిటీ అనుమానం వ్యక్తం చేస్తోంది. సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. నిందితులను వెంటనే పట్టుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
