తెలంగాణ RTA లో భారీ ప్రక్షాళన.. 180 మందికి పైగా అధికారుల బదిలీ

తెలంగాణ RTA లో భారీ ప్రక్షాళన.. 180 మందికి పైగా అధికారుల బదిలీ

తెలంగాణ రవాణా శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఆర్టీవో అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం తక్షణ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం.. మొత్తం ఎనిమిది మంది రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ అధికారులకు కొత్త పోస్టింగ్స్ ఇచ్చారు.

మల్టీ జోన్-1 పరిధిలో ముగ్గురు ఆర్టీవోలు బదిలీ అయ్యారు. ఇందులో వికారాబాద్ డీటీఓగా ఉన్న పి. వెంకట్ రెడ్డిని ఆసిఫాబాద్‌కు, పెద్దపల్లి డీటీఓ పి. రంగారావును బదిలీ చేయగా.. వరంగల్ డీటీఓ టి. సంతోష్ కుమార్‌ను కామారెడ్డికి బదిలీ చేశారు.

ఇక మల్టీ జోన్-2 పరిధిలో ఐదుగురు అధికారులకు స్థానచలనం కలిగింది. హైదరాబాద్ ఈస్ట్ జోన్ ఆర్‌టీఏగా ఎం. రఘునందన్ గౌడ్, హైదరాబాద్ సెంట్రల్ జోన్-1కు ఎల్. కిష్టయ్య నియామకమయ్యారు. అలాగే సూర్యాపేట డీటీఓ ఎం. పురుషోత్తం రెడ్డిని హైదరాబాద్ సెంట్రల్ జోన్-1కు బదిలీ చేయగా.. ఇబ్రహీంపట్నం ఆర్‌టీఏ వి. సుభాష్ చంద్రను వికారాబాద్ డీటీఓగా నియమించారు. నాగోల్ డీటీటీగా చి. కొండయ్యకు, ఉప్పల్ డీటీఓగా ఎం. సురేశ్ బాబుకు పోస్టింగులు ఇచ్చారు.

వీరితో పాటు రవాణా శాఖలో క్షేత్రస్థాయిలోనూ భారీ మార్పులు జరిగాయి. ఏకంగా 94 మంది మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు (MVI), మరో 90 మంది అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లను (AMVI) బదిలీ చేశారు. ఈ బదిలీ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.