వికారాబాద్ జిల్లా రంగాపూర్ లో ఉద్రిక్తత

వికారాబాద్ జిల్లా రంగాపూర్ లో ఉద్రిక్తత

వికారాబాద్ జిల్లా : పరిగి మండలం రంగాపూర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. సర్వే నంబర్ 18 లోని 9.39 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇండ్లు లేని నిరుపేదలకు కేటాయించాలంటూ సీపీఎం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసే ప్రయత్నం చేసిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఇండ్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని సీపీఎం నాయకుడు డిమాండ్ చేస్తున్నారు.

స్థానిక ఎమ్మార్వో, ఆర్డీవో, జిల్లా కలెక్టర్ రావాలంటూ నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకటయ్యతో పాటు పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళలు అడ్డుకోవడంతో పోలీసులకు, ఆందోళనకారుల మధ్య వాగ్వివాదం, తోపులాట చోటు చేసుకుంది. హైదరాబాద్ బీజాపూర్ హైవేపై బైఠాయించి ఆందోళన చేస్తున్న వారిని కూడా అడ్డుకున్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాంటూ గత రెండేళ్లుగా ప్రభుత్వ భూమి కోసం సీపీఎం నాయకులు పోరాడుతున్నారు.