ఈ వారం ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు ఇవే..

ఈ వారం ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు ఇవే..

రోజు రోజుకు ఓటీటీల్లో సినిమాల సందడి ఎక్కువవుతోంది. ఈ వారం కూడా చాలా సినిమాలు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ అవుతున్నాయి. సరికొత్త కంటెంట్‌తో ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించేందుకు  ఓటీటీ  సై అంటోంది.

ఆ సినిమాలు ఏంటంటే....? 

అశోకవనంలో అర్జున కల్యాణం
మాస్‌ సినిమాలతో ఫాలోయింగ్‌ తెచ్చుకున్న విశ్వక్‌సేన్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ అశోకవనంలో అర్జున కల్యాణం. ఇందులో విశ్వక్‌ అద్భుతమైన నటన కనబర్చాడు. రుక్సార్‌ ధిల్లాన్‌ కథానాయికగా ఆకట్టుకుంది. మే 6న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. తాజాగా నెల రోజుల్లోనే ఓటీటీ బాట పట్టిన ఈ చిత్రం ఆహాలో మే 27 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

కణ్మణి రాంబో ఖతీజా
విజయ్‌ సేతుపతి, నయనతార, సమంత ప్రధానపాత్రల్లో నటించిన ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ కాతువాకుల రెండు కాదల్‌. విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో కణ్మణి రాంబో ఖతీజాగా విడుదలైంది. తాజాగా ఓటీటీ ట్రాక్‌ ఎక్కిన ఈ మూవీ మే 27 నుంచి హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది.

అటాక్‌
జాన్‌ అబ్రహం హీరోగా నటించిన మూవీ అటాక్‌: పార్ట్‌ 1. జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రకాశ్‌ రాజ్‌ కీలక పాత్రల్లో నటించారు. ఏప్రిల్‌1న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ దగ్గర అంతంతమాత్రంగానే ఆడింది. జీ 5లో మే 27 నుంచి అందుబాటులోకి రానుంది.

 


హాట్‌స్టార్‌
ఒబీ వ్యాన్‌ కెనోబి (వెబ్‌ సిరీస్‌) - మే 27

నెట్‌ఫ్లిక్స్‌
తులసీదాస్‌ జూనియర్‌ - మే 23


వెల్‌కమ్‌ టు వెడ్డింగ్‌ హెల్‌ - మే 23


స్ట్రేంజర్‌ థింగ్స్‌ (నాలుగో సీజన్‌) - మే 27


సోనీ లివ్‌
నిర్మల్‌ పాఠక్‌ కీ ఘర్‌ వాపసీ (వెబ్‌ సిరీస్‌) - మే 27

 

సేత్తుమాన్‌ - మే 27

జీ 5
ఫోరెన్సిక్‌ - మే 24