కక్ష సాధింపుతోనే మెట్రో రెండో దశను అడ్డుకుంటున్నరు: బీఆర్ఎస్

కక్ష సాధింపుతోనే మెట్రో రెండో దశను అడ్డుకుంటున్నరు: బీఆర్ఎస్

గచ్చిబౌలి, వెలుగు: ప్రభుత్వాలు మారిన ప్రతిసారి ప్రపోజల్స్​మారిస్తే అభివృద్ధి జరగదని రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఇన్​చార్జి పట్లోళ్ల కార్తీక్ రెడ్డి అన్నారు. రాయదుర్గం మెట్రో స్టేషన్ వద్ద సోమవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. వీరిని పోలీసులు అరెస్ట్ చేసి నార్సింగి పీఎస్​కు తరలించారు. 

ఈ సందర్భంగా కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ.. ఐటీ కారిడార్ నుంచి శంషాబాద్ ఎయిర్​పోర్ట్​వరకు మెట్రో రైల్ విస్తరిస్తే నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందన్నారు. కక్ష సాధింపు కోసమే సీఎం రేవంత్​రెడ్డి  మెట్రో రైల్ రెండో దశ ప్రాజెక్ట్​ను అడ్డుకున్నారని ఆరోపించారు. శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.