నేను తమాషా చేయడంలేదు..ఫోన్ ఇవ్వకపోతే వాళ్లు తుపాకీ తీస్తారు.. బ్రిక్స్ సదస్సులో రిపోర్టర్‌కు రష్యా మంత్రి వార్నింగ్

నేను తమాషా చేయడంలేదు..ఫోన్ ఇవ్వకపోతే వాళ్లు తుపాకీ తీస్తారు.. బ్రిక్స్ సదస్సులో రిపోర్టర్‌కు రష్యా మంత్రి వార్నింగ్

ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రుల సదస్సులో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. బ్రిక్స్ సదస్సు కోసం ఢిల్లీలో పర్యటిస్తున్న రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఫ్రస్టేషన్ కు గురయ్యారు. ఓ రిపోర్టర్ పై  తీవ్రస్థాయిలోమండిపడ్డారు. ప్రెస్ మీట్ లో మాట్లాడుతుండగా.. ఫోన్  మాట్లాడారని.. అది తనకు అంతరాయం కలిగిందంటూ ఓ రిపోర్టర్ ను బెదిరించారు. సెల్ ఫోన్ పక్కన పెడతావా  లేకుంటే  మా సెక్యూరిటీ సిబ్బంది తుపాకీ తీస్తారంటూ బెదిరింపులకు పాల్పడిన ఘటన వైరల్ అవుతోంది. 

తాను మాట్లాడుతుండగా ఓ జర్నలిస్టు ఫోన్ లో బిజీగా ఉన్నారని అది ఆయన స్పీచ్ కు అంతరాయం కలిగించిందని  రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రిపోర్టర్ వెంటనే బయటికి పంపించాలని  భద్రతా సిబ్బందిని  కోరారు.  అంతేనా.. మీరు దయచేసి బయటికి వెళ్తారా.. ఫోన్ బంద్ చేస్తారా.. లేకుండా మా  భద్రతా సిబ్బంది గన్ తీస్తారు అంటూ పరోక్షంగా కాల్చివేస్తామన్నట్లు రిపోర్టర్ ను బెదిరించారు సదరు మంత్రి. ‘‘ నేనేం కామెడీ చేయడంలేదు.. నీ ఫోన్ అప్పగించకపోతే వాళ్లు తుపాకీ తీస్తారు అంటూ సెక్యూరిటీ సిబ్బంది వైపు చూపించారు రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్. 

లావ్రోవ్ ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే హాల్‌లోని వారంతా ఒక్కసారిగా నవ్వారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. భారతదేశంలో ఇది కేవలం జోక్ కావచ్చు..కానీ రష్యాలో ఇది నిజమైన హెచ్చరిక!" అంటూ కొందరు కామెంట్లు చేశారు. రష్యన్ డిప్లొమాటిక్ స్టైల్‌లో ఇదొక డార్క్ హ్యూమర్ (నవ్వులాట వ్యాఖ్య) అని మరికొందరు కామెంట్ చేశారు.  ప్రెస్ కాన్ఫరెన్స్‌లలో కనీస నియమాలు పాటించని మీడియా ప్రతినిధుల ప్రవర్తనను కూడా కొందరు తప్పుబట్టారు.