Weekend Movies: ఈ శుక్రవారం థియేటర్లలో ఏకంగా 9 సినిమాలు.. ‘ఓ సుకుమారి’ నుంచి ‘ది ఒడిస్సీ’ వరకు

Weekend Movies: ఈ శుక్రవారం థియేటర్లలో ఏకంగా 9 సినిమాలు.. ‘ఓ సుకుమారి’ నుంచి ‘ది ఒడిస్సీ’ వరకు

ఈ శుక్రవారం (జులై 17, 2026న) థియేటర్లలో సినీ ప్రియులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు పలు కొత్త సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. గత వారం 'లెనిన్', అలాగే తమిళ డబ్బింగ్ చిత్రాలు 'హృదయం మురళి', 'లవ్ ఓ లవ్' ప్రేక్షకులను అలరించగా.. ఈ వారం ఏకంగా ఎనిమిది తెలుగు చిత్రాలతో పాటు ఓ భారీ హాలీవుడ్ మూవీ కూడా బాక్సాఫీస్ బరిలోకి దిగుతోంది. మరి ఈ వారం థియేటర్లలో విడుదల కానున్న సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

‘ఓ సుకుమారి’

మసుధ ఫేమ్ తిరువీర్, ఐశ్వర్య రాజేష్​ జంటగా భరత్ దర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఓ..! సుకుమారి’. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. హీరోయిన్‌‌‌‌ను ముట్టుకుంటే షాక్ కొట్టడం అనే యూనిక్ కాన్సెప్ట్ తో మూవీ తెరకెక్కింది. విలేజ్ బ్యాక్‌‌‌‌డ్రాప్, ఎమోషన్స్ అందరికీ కనెక్ట్ అయ్యేలా సినిమా రూపొందింది. ఈ ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌టైనర్ జులై 17న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. 

‘వదలా’

జగపతి బాబు లీడ్ రోల్‌‌లో రూపొందిన సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘వదలా’. లయ, హృతికా శ్రీనివాస్ హీరోయిన్స్ గా నటించారు. అకెళ్ల వి కృష్ణ దర్శకుడు. చరితచిత్ర ప్రొడక్షన్ బ్యానర్‌‌‌‌పై తమ్మారెడ్డి భరద్వాజ్, కిషోర్ నాయుడు చిరుమమిల్ల నిర్మించారు. ఈ సినిమా ఒక వ్యక్తి జీవితంలోని రహస్యాలు, భావోద్వేగాల చుట్టూ తిరిగే గ్రిప్పింగ్ సస్పెన్స్ డ్రామా అని టీజర్, ట్రైలర్ ద్వారా క్లారిటీ వచ్చింది. జులై 17న మూవీ రానుంది. 

‘మిస్టర్‌‌‌‌ మిడిల్ క్లాస్‌‌’

శ్రీకాంత్, లయ జంటగా జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మిస్టర్‌‌‌‌ మిడిల్ క్లాస్‌‌’. రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ఫ్యామిలీ ఎంటర్‌‌టైనర్‌‌ గా తెరకెక్కిన ఈ మూవీ జులై 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

‘ఎంఆర్‌పీ’ (MRP)

టాలీవుడ్ టాలెంటెడ్ యాకర్ట్ నరేశ్ అగస్త్య, కామెడీ కింగ్ వెన్నెల కిశోర్, ఫన్ బాంబ్ సుదర్శన్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘ఎంఆర్‌పీ’ (MRP). ‘నీకెంత.. నాకెంత’ అనే ఆసక్తికరమైన ట్యాగ్ లైన్తో తెరకెక్కిన ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మార్చురీలో పనిచేసే నలుగురు యువకులు గుర్తుతెలియని శవాన్ని కిడ్నాప్ చేసి డబ్బు సంపాదించాలని వేసిన ప్లాన్ చుట్టూ కథ సాగుతుంది. క్రైమ్, కామెడీ, థ్రిల్లర్ అంశాలతో వస్తున్న ఈ మూవీ జులై 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

►ALSO READ | Kotha Cinema: ‘సినిమా’ పిచ్చితో హీరోగా కిరాణం షాపు నడిపే వ్యక్తి.. మట్టి మాటలు, మట్టి కథ.. ఎమోషనల్ స్పీచ్

‘రాజా ది రాజా’

రుత్విక్, విశాఖ ధిమాన్ జంటగా అనిల్ బోయిడపు దర్శకత్వంలో కె. నిహారికా దాసరి నిర్మించిన చిత్రం ‘రాజా ది రాజా’. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్  ద్వారా  జులై 17న సినిమా విడుదల  కానుంది. ఇదొక ఫ్యామిలీ లవ్ ఎంటర్‌‌‌‌టైనర్ గా తెరకెక్కింది.

‘ఒక కోర్టు కేస్’

సూర్యాన్ష్  హీరోగా గణేష్ పూడి దర్శక నిర్మాతగా రూపొందిన చిత్రం ‘ఒక కోర్టు కేస్’. జులై 17న సినిమా విడుదల కానుంది. ‘ప్రేమలో మోసపోయిన ఒక వ్యక్తి న్యాయం కోసం లీగల్‌‌గా ఎలాంటి పోరాటం చేశాడు అనేదే ఈ సినిమా కథ.

‘వెంకట్రామయ్య గారి తాలూకా’

దినేష్ కుమార్, దివిజ ప్రభాకర్ జంటగా సతీష్ ఆవాల దర్శకత్వంలో కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి నిర్మించిన చిత్రం ‘వెంకట్రామయ్య గారి తాలూకా’.  జులై 17న సినిమా విడుదల కానుంది.  

‘ఆపరేషన్ అరుణారెడ్డి’

రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి దర్శక నిర్మాతగా వ్యవహరిస్తూ ముఖ్య పాత్ర పోషించిన సినిమా ‘ఆపరేషన్ అరుణారెడ్డి’. కథ, స్క్రీన్‌‌‌‌ప్లే, మాటలు, పాటలు, ఎడిటింగ్ బాధ్యతలు కూడా పోసాని కృష్ణమురళి వహిస్తుండటం విశేషం. హిందోళ చక్రవర్తి, కాజల్ శర్మ, ఆయేషా ఖాన్, బీజేపీ నేత రఘునందన్ రావు ముఖ్య పాత్రల్లో నటించారు. ‘ఇది నిజాయితీపరులైన జర్నలిస్టుల కథ. జర్నలిస్టులు నిజాయితీగా ఉంటే సొసైటీ బాగుపడుతుంది అనేది చిత్ర కథాంశం.

‘ది ఒడిస్సీ’ 

అకాడమీ అవార్డు విన్నర్, దర్శక దిగ్గజం క్రిస్టోఫర్ నోలన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు క్రిస్టోఫర్. ఇపుడీ ఈ దర్శక దిగ్గజం తెరకెక్కించిన  లేటెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ ‘ది ఒడిస్సీ’ (The Odyssey).

భారీ అంచనాల మధ్య జూలై 17, 2026న భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పూర్తిగా IMAX కెమెరాలతో చిత్రీకరించిన తొలి ఫీచర్ ఫిల్మ్‌గా ఈ చిత్రం ప్రత్యేక గుర్తింపు పొందింది.