- ప్రేమికులకు కేరాఫ్ అడ్రస్ గా సూరయ్యపల్లి
- ప్రేమనగర్ గా పిలుచుకుంటున్న జనం
ప్రేమ జంటలకు వారివారిళ్లలో చోటు లభించదు. ప్రేమ పెళ్లి చేసుకున్నాక ఎటెళ్లాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నవారికి ఓ ఊరు నేనున్నానంటూ భరోసానిస్తుంది. ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న జంటలకు ఆ ఊరు ఆశ్రయమిస్తుంది. తల్లిదండ్రుల ఆదరణ కరువైన ఆ ప్రేమికులకు తలదాచుకునేందుకు చోటిస్తుంది. ఇప్పటి వరకు ఆ గ్రామంలో 30 జంటలున్నాయి. అదే తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథని మండలం సూరయ్యపల్లి. ప్రేమికుల రోజును పురస్కరించుకొని సూరయ్యపల్లిపై ‘వెలుగు’ అందిస్తున్న ప్రత్యేక కథనం..
మంథని, వెలుగు: ఒక్కో గ్రామానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుం ది. ఒక్కో గ్రామం ఒక్కో అంశంతో పేరు సంపాదించుకుంటుం ది. మంథని మండలం సూరయ్యపల్లి గ్రామానికీ ఉందో ప్రత్యేకత. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటలకు ఎటెళ్లాలో తెలియక దిక్కులు చూస్తుం టే సూరయ్యపల్లి చేతులు చాచి నేనున్నా రమ్మం టూ అక్కున చేర్చుకుంటుం ది. గ్రామంలో సుమారు 30 జంటలు ప్రేమ పెళ్లి చేసుకుని స్థిరపడ్డా యి. అందుకే ఆ గ్రామాన్ని అంతా ప్రేమ్ నగర్ అని పిలుచుకుంటారు.
రెండు దశాబ్దాల క్రితం నుంచే..
ప్రేమబంధంతో ఒక్కటైన జంటలకు మంథని మండలం సూరయ్యపల్లి గ్రామం అడ్రస్‌గా నిలుస్తోం ది. రెం డు దశాబ్దా ల క్రితం ప్రేమ పెళ్లిళ్లకు బీజం పడ్డ గ్రామంలో ఇప్పటి వరకు సుమారు 30 జంటలు ప్రేమ పెళ్లి
చేసుకొని జీవనం సాగిస్తున్నాయి. కులం, మతాన్ని కాదని ప్రేమ బంధంతో ఏకమైన జంటలకు ఈ గ్రామం ఆశ్రయమిచ్చి ప్రేమ్ నగర్ గా మారిపోయింది.

వివిధ ప్రాంతాలకు చెందిన వారు…
సూరయ్యపల్లి గ్రామస్తుల కంటే ఇతర ప్రాంతాల నుం చి ప్రేమ పెళ్లి చేసుకొని స్థిరపడ్డవారు ఎక్కువనే చెప్పవచ్చు. మంథనిలోని శ్రీలక్ష్మీనారాయణస్వామి గుడిలో పెళ్లి చేసుకున్న ప్రేమజంటలే ఈ గ్రామంలో ఎక్కువ మంది స్థిరపడ్డా రు. అయితే ఇందులో కొన్ని జంటలు రెండు మూడేళ్ల తర్వాత ఉపాధి కోసం మరో ప్రాంతానికి వెళ్లాయి. బయటి ప్రాంతాలకు వెళ్లిన వారు అప్పడప్పుడు ఇక్కడకు వచ్చి అందరితో కలిసి వెళ్లడం ఆనవాయితీగా మారిపోయిం ది.
ఒకే గ్రామంలో 13 జంటలు
సిద్దిపేట, వెలుగు నెట్ వర్క్: కులం, మతం పేరుతో ప్రేమికులను విడదీసే వారు, పరువు కోసం పాకులాడే వాళ్లు ఓ సారి సిద్ది పేట జిల్లా, మిరుదొడ్డి మండలం, భూం పల్లి ఆదర్శదంపతుల గురించి తెలుసుకుం టే మంచిది. వారి ఐక్యత, ఆనందమయమైన కుటుం బ జీవనాన్ని గమనిస్తే వారి అనుమానాలన్నీ పటాపంచలవుతాయి. ఇప్పటి వరకు భూం పల్లిలో కులాం తర, మతాం తర వివాహాలు 13 జరిగాయి. కుల, మత విభేదాలను ఎదుర్కొని సుఖ సంతోషాలతో జీవనం సాగిస్తూ అందరికీ ఆదర్శప్రాయంగా ఈ జంటలు నిలుస్తున్నాయి.
