V6 News

విరాట్ కోహ్లిని ప్రశంసించిన పాక్ క్రికెటర్ 

విరాట్ కోహ్లిని ప్రశంసించిన పాక్ క్రికెటర్ 

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని పాకిస్తాన్ క్రికెటర్ ప్రశంసలతో ముంచెత్తాడు. న్యూజిలాండ్ తో జరిగిన ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో భారత్ ఓడిపోవడంతో కోహ్లిపై  విమర్శలు చెలరేగుతున్నాయి. ఛాంపియన్ షిప్ ను డిసైడ్ చేసే కీలక ఫైనల్ మ్యాచ్ ఒక్కటే జరిపి టైటిల్ ఇవ్వడం సరిగా లేదని.. ఫైనల్స్  ను  బెస్టాఫ్ త్రీ గా మూడు మ్యాచులు డిసైడ్ చేసి ఛాంపియన్ షిప్ ఇస్తే బాగుంటుందని పేర్కొన్న విషయం తెలిసిందే. 
ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేక సమర్ధించుకునే ప్రయత్నం చేస్తున్నాడని.. అందుకే బెస్టాఫ్ త్రీ 3 మ్యాచులు పెట్టాలంటున్నాడని పలువురు నెటిజనులు ట్రోలింగ్ చేస్తుంటే పాకిస్తాన్ క్రికెటర్, వెటరన్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్ మెన్ కమ్రాన్ అక్మల్ మాత్రం విమర్శలు అర్ధరహితమని కొట్టేశారు. అంతేకాదు.. కోహ్లి గొప్ప క్రికెటర్ అంటూ కొనియాడారు. 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తోపాటు 2019 ప్రపంచకప్ సెమీ ఫైనల్లో భారత్ ఓడిపోవడం వెనుక విరాట్ కోహ్లి తప్పేమీ లేదని.. అతనో మ్యాచ్ విన్నర్ అని.. ప్రతిసారి సక్సెస్ కావడం అసాధ్యమనే విషయం అందరూ గుర్తుంచుకోవాలని సూచించాడు. క్రికెట్ క్రీడ గురించి ఏ మాత్రం అవగాహన లేని వారే ఆయనపై విమర్శలు చేస్తారని కమ్రాన్ అక్మల్ పేర్కొన్నాడు.