కుత్బుల్లాపూర్, వెలుగు: కుత్బుల్లాపూర్భౌరంపేటలోని మైనారిటీ రెసిడెన్షియల్స్కూల్లో చదువుకునే ఇద్దరు బాలురిపై అక్కడే చదువుకునే ముగ్గురు కాలేజీ విద్యార్థులు లైంగిక దాడికి పాల్పడ్డారు.
నాలుగు రోజుల కింద ఈ ఘటన జరగ్గా సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు ముందు భయపడి ఎవరికీ చెప్పలేదని, శనివారం ఇంటికి వెళ్లగా అక్కడ వారి తల్లిదండ్రులకు చెప్పడంతో ఫిర్యాదు చేశారని దుండిగల్పోలీసులు తెలిపారు.
