తిరుపతి జిల్లా చంద్రగిరి (మం) ఎల్లంపల్లెలో ఏనుగుల మంద కలకలం రేపాయి. గత వారం రోజులుగా ( మార్చి 20 నాటికి) గ్రామంలోనే తిష్ట వేసిన గజరాజులు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. రాత్రి వేళల్లో పంట పొలాలపై విరుచుకుపడడంతో భారీగా పంటలు దెబ్బతిన్నాయి. ఏనుగుల నుంచి తప్పించుకునే క్రమంలో పశువుల కాపరి ముత్తు రామయ్యకు గాయాలయ్యాయి.
గజరాజుల సంచారంతో ఎల్లంపల్లె గ్రామస్తులు భయ భయంగా గడుపుతున్నారు. అటవీశాఖ అధికారులు ఏనుగును అడవిలోకి మళ్లించేందుకు చర్యలు చేపట్టారు. గ్రామస్థులను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
