శ్రీచైతన్య, నారాయణను నిషేధించాలి: టీజేఎస్ నేత సర్దార్ వినోద్ కుమార్

శ్రీచైతన్య, నారాయణను నిషేధించాలి: టీజేఎస్ నేత సర్దార్ వినోద్ కుమార్

హైదరాబాద్, వెలుగు : రాష్ర్ట విద్యార్థులను దోచుకుంటున్న  శ్రీచైతన్య, నారాయణ విద్యా సంస్థలను వెంటనే బ్యాన్ చేయాలని టీజేఎస్ స్టూడెంట్ విభాగం అధ్యక్షుడు సర్దార్ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ రెండు సంస్థలు సాధారణ, మధ్య తరగతి విద్యార్థులకు ఇంటర్ విద్యను దూరం చేస్తున్నాయని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో సౌలతులు కల్పించకుండా పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ఇంటర్ బోర్డు అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న శ్రీచైతన్య, నారాయణ కాలేజీలను రద్దు చేయాలని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీ  యాజమాన్యలపైనా క్రిమినల్ కేసులు నమోదు చెయ్యాలన్నారు.