కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత, ఫల్టా ‘పుష్ప’ జహంగీర్ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగాల్ ఎన్నికల టైంలో దక్షిణ 24 పరగణాల జిల్లా ఫల్టా నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీచేసిన జహంగీర్.. ఈవీఎంల అవకతవకలకు పాల్పడ్డారు. ఓటింగ్ మిషన్లలో బీజేపీ గుర్తు దగ్గరున్న బటన్‌ను ఓటర్లు నొక్కకుండా, దానిపై టేప్ అంటించారనే ఆరోపణలతో ఆయనపై ఐదు కేసులు నమోదయ్యాయి.
ఈ క్రమంలో జహంగీర్ ఇంటెరిమ్ ప్రొటెక్షన్ (ముందస్తు రక్షణ)ను పొడిగించడానికి కలకత్తా హైకోర్టు నిరాకరించింది. దాంతో జహంగీర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. నిందితుడు దేశం విడిచి పారిపోతున్నాడనే పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పశ్చిమ బెంగాల్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) అధికారులు.. ఇండియా, నేపాల్ సరిహద్దుల్లో అతడిని అదుపులోకి తీసుకున్నారు.
