తమిళనాడులో సంపన్న అభ్యర్థి లీమా రోజ్ గెలుపు

తమిళనాడులో సంపన్న అభ్యర్థి లీమా రోజ్ గెలుపు
 
తిరుచ్చి: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనాలు నమోదవుతున్నాయి. అన్నాడీఎంకే అభ్యర్థి, లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ భార్య లీమా రోజ్ మార్టిన్ లాల్గుడి నియోజకవర్గంలో గెలుపొందారు. టీవీకే అభ్యర్థి కు.పా. కృష్ణన్‌‌‌‌పై 2,739 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈసీ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. 21 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి  లీమా రోజ్ మార్టిన్ 60,795 ఓట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచారు. కు.పా. కృష్ణన్ 58,056 ఓట్లను సాధించి రెండో స్థానంలో ఉన్నారు. డీఎంకే అభ్యర్థి టి. పరివల్లాల్ 55,565 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. లీమా రోజ్ అఫిడవిట్‌‌‌‌లో రూ.1,049.5 కోట్ల ఆస్తులను ప్రకటించారు. ఎన్నికల బరిలో నిలిచిన సంపన్న అభ్యర్థిగా రికార్డు నెలకొల్పారు. తిరుచ్చి జిల్లాలో టీవీకే  హవా కొనసాగింది. జిల్లా మొత్తంలో అన్నాడీఎంకే తరపున గెలిచిన ఏకైక అభ్యర్థి లీమా రోజ్ మాత్రమే కావడం విశేషం.