ఒలింపిక్స్ హాకీలో టీమ్ ఇండియా శుభారంభం చేసింది. పురుషుల హాకీలో న్యూజిలాండ్ పై గ్రాండ్ విక్టరీ సాధించింది. 3-2 తేడాతో న్యూజిలాండ్ ను ఓడించింది. హర్మన్ ప్రీత్ సింగ్ రెండు గోల్స్ చేశాడు. రూపిందర్ పాల్ సింగ్ మొదటి గోల్ సాధించాడు. మ్యాచ్ మొదలైన ఆరో నిమిషంలోనే న్యూజిలాండ్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఐతే పదో నిమిషంలో రూపిందర్ గోల్ కొట్టి స్కోరు సమం చేశాడు. ఆ తర్వాత రెండు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. అయితే 26వ నిమిషంలో హర్మన్ ప్రీత్ గోల్ కొట్టి టీమ్ ఇండియాను 2-1తో ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. కోర్టు మారగానే మరోసారి హర్మన్ ప్రీత్ 33వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ ను గోల్ గా మలవడంతో భారత్ 3-1తో అధిపత్యంలోకి దూసుకెళ్లింది. మరో 10 నిమిషాల టైంలోనే స్టీఫెన్ జోసెఫ్ గోల్ కొట్టాడు. దీంతో న్యూజిలాండ్ స్కోర్ 2-3కు చేరింది. తర్వాత మ్యాచ్ లో ఆసీస్ తో భారత్ రేపు తలపడనుంది.

