కేబీఆర్ పార్కులో సినీ నటిపై దాడి

కేబీఆర్ పార్కులో సినీ నటిపై దాడి

హైదరాబాద్: సినీ నటి షాలూ చౌరాసియాపై గుర్తు తెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఈవ్నింగ్ వాక్‌‌కు వెళ్లిన చౌరాసియా మీద దుండగుడు దాడి చేసి.. ఆమె ఫోన్ లాక్కొని పారిపోయాడు. ఆదివారం రాత్రి 8:30 గంటల సమయంలో కేబీఆర్‌ పార్క్‌ వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. షాలూ 100 నంబర్‌‌కు సమాచారం ఇవ్వడంతో బంజారా హిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక, గాయపడిన షాలూ చౌరాసియా సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు.