అమెరికాలో టోర్నడో బీభత్సం సృష్టించింది. అలబామాలో ఈ టోర్నడో ధాటికి చనిపోయిన వారి సంఖ్య 22కు పెరిగింది. చాలా మందికి గాయాలయ్యాయి. వారిని హాస్పిటల్స్ లో చేర్పించారు. మరికొందరి కోసం గాలింపు కొనసాగుతోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు. చనిపోయిన వారిలో పిల్లలు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. చాలా మంది మిస్ అయినట్లు అలబామాలోని నేషనల్ వెదర్ సర్వీస్ తెలిపింది. లీ కౌంటీలో చాలా మంది ఇబ్బందులు పడ్డారు. టోర్నడో ఎఫెక్ట్ తో గంటకు 250 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. దీంతో కరెంట్ సరఫరాకు అంతరాయం కలిగింది. చెట్లు విరిగిపడ్డాయి. వాహనాలు ధ్వంసమయ్యాయి.
