
తెలంగాణ సాయుధ పోరాటానికి ఊపిరులూదిన ప్రాంతం భువనగిరి. రాష్ట్రంలో అధికార,ప్రతిపక్షాల మధ్య టఫ్ ఫైట్ జరుగుతుందని భావిస్తున్న లోక్ భ నియోజకవర్గా ల్లో భువనగిరి ఒకటి. 2009 కొత్తగా ఏర్పాటైన ఈ లోక్ సభ సెగ్మెంట్లో మొదటిసారి కాం గ్రెస్ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంపీగా గెలిచారు.గత (2014) ఎన్ని కల్లో టీఆర్ ఎస్ నుంచి బూరనర్సయ్యగౌడ్ విజయం సాధిం చారు. మొదటి నుంచి కాం గ్రెస్ కు గట్టిపట్టున్న నల్గొం డ జిల్లాలో భాగమైన భువనగిరిని ఈసారి తిరిగి దక్కించుకోవాలని కాం గ్రెస్ పార్టీ గట్టిగా ప్రయత్నిస్తోంది.ఇందుకోసం కోమటిరెడ్డి బ్రదర్స్ తమ శక్తియుక్తులన్నీ కేంద్రీకరిస్తున్నారు. మరోవైపు అసెంబ్లీ ఫలితాలతో జోష్ మీదున్న టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తోంది. బీజేపీ నుంచి పడాల శ్యాంసుందర్ రావు, సీపీఐ అభ్యర్థి గోద శ్రీరాములు బరిలో ఉన్నారు.
సవాలుగా తీసుకున్న కోమటిరెడ్డి బ్రదర్స్…
భువనగిరి లోక్ స భ సెగ్మెంట్ పరిధిలో ఆలేరు, జనగాం , భువనగిరి, మునుగోడు, తుంగతుర్తి ,నకిరేకల్, ఇబ్రహీంపట్నం అసెం బ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఇందులో మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నకిరేకల్ లో చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ నుంచి గెలవగా.. మిగతా చోట్ల టీఆర్‍ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. చిరుమర్తి లింగయ్య కూడా గులాబీ గూటికి చేరనున్నారు. అయితే భువనగిరి సీటును ఎలాగైనా గెలుచుకోవాలన్న లక్ష్యంతో కాం గ్రెస్ హైకమాండ్ ఇక్కడ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి టికెట్ ఇచ్చింది. ఆయన సోదరుడు,ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి గెలుపు బాధ్యత అప్పగించింది. ఈ ఇద్దరు బ్రదర్స్‌కు ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో గట్టి పట్టుంది. కాంగ్రెస్ పార్టీకి మంచి క్యాడర్ ఉంది. ఈ నేపథ్యంలో వారిద్దరూ భువనగిరి గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేస్తున్నారు. సెగ్మెంట్ పరిధిలో విస్తృతంగా తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. గతంలో నల్లగొండ నుంచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యే గా గెలిచిన వెంకట్ రెడ్డి ఇటీవలి ఎన్ని కల్లో ఓడిపోయారు. ఈ సానుభూతి కూడా కలిసొస్తుందని భావిస్తున్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ పార్టీని వీడడం కొంత ఇబ్బందికరం కానుంది.
అసెంబ్లీ ఫలితాలే టీఆర్‍ఎస్ బలం….
భువనగిరి లోక్ సభ స్థా నంలో అసెంబ్లీ ఫలితాల మాదిరిగానే లోక్ సభ ఫలితాలు వస్తాయని టీఆర్‍ఎస్ పార్టీ ధీమాగా ఉంది. సిట్టిం గ్ గా ఉన్న బూర నర్సయ్యగౌడ్, మంత్రి జగదీశ్ రెడ్డి , రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‍లు ఎమ్మెల్యే లతో కలిసి విస్తృ తంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 2న కేసీఆర్ తో భువనగిరిలో బహిరంగ సభను తలపెట్టారు. బూర నర్సయ్యగౌడ్ సామాజిక వర్గం కూడా ఆయనకు కలసి వస్తుందని భావిస్తున్నారు. అయితే ఎంపీగా ఉన్న ఐదేళ్లలో తన సామాజికవర్గాన్ని తప్ప ఇతరులను పట్టిం చుకోలేదని, కార్యకర్తలకు అందుబాటులో లేరని ఇక్కడి కేడర్ లో అసంతృప్తి ఉందని అంటున్నారు. లోక్ సభ స్థా నం పరిధిలోని పలువురు ఎమ్మెల్యే లతోనూ ఎంపీ అభ్యర్థి కి విభేదాలున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నల్గగొండ, ఖమ్మం ,వరంగల్ సెగ్మెంట్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్ని కల్లో టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి ఓడిపోవడం కూడా వ్యతిరేక ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. గెలుపోటములపై కమ్యూనిస్టుల ఎఫెక్ట్భువనగిరి లోక్ సభ సెగ్మెం ట్ పరిధిలోని మునుగోడు, ఆలేరు, జనగాం నియోజకవర్గాల్లో సీపీఐకి, ఇబ్రహీంపట్నం, నకిరేకల్, భువనగిరి అసెంబ్లీ స్థా నాల్లో సీపీఎం పార్టీకి పట్టుంది. గతంలో ఈ సీట్లలో ఇరు పార్టీల ఎమ్మెల్యేలుగా గెలిచారు. తర్వాత వారి ప్రాబల్యం తగ్గింది. ఈసారి రెండు పార్టీలు కలిసి ఉమ్మడి అభ్యర్థి గా గోద శ్రీరాములును బరిలోకి దింపాయి. ఇది ఎన్ని కపై ప్రభావం చూపనుంది. గోద శ్రీరాములు గీతకార్మిక వర్గానికి చెందినవారు కావడంతో..అధికార పార్టీ అభ్యర్థి ఓట్లను చీల్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
మోడీ చరిష్మాపై ఆశలతో..
ప్రధాని మోడీ చరిష్మాతో ఓట్లను పెంచుకునేందుకు యాదాద్రి జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్యాంసుం దర్ రావును బీజేపీ బరిలోకి దింపింది. పట్టణ ఓటర్లతోపాటు యువత ఓట్లను రాబట్టు కునేలా శ్యాంసుందర్ రావు ప్రచారం చేస్తున్నారు. గత ఎన్ని కల్లో ఇక్కడ బీజేపీ నుంచి పోటీ చేసిన నల్లు ఇంద్రసేనారెడ్డి 1.83 లక్షల పైచిలుకు ఓట్లను సాధిం చారు కూడా. ఈసారి పోటీ చేస్తున్న శ్యాంసుం దర్ రావుకు మూసీ ప్రక్షాళన కోసం పోరాడిన నేతగా పేరుంది. గతంలో రెండు సార్లు ఎమ్మెల్యే గా పోటీ చేసేం దుకు అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారి పోయిందనే సానుభూతి ఉంది. ఇది ఆయనకు కలిసొస్తుందని భావిస్తున్నారు.