మున్సి పల్ అభ్యర్థులకు బీ ఫామ్ ల అందజేత.. డీసీసీ చీఫ్ల కు బీ ఫామ్ లు పంపించిన పీసీసీ

మున్సి పల్ అభ్యర్థులకు బీ ఫామ్ ల అందజేత.. డీసీసీ చీఫ్ల కు బీ ఫామ్ లు పంపించిన పీసీసీ
  • స్క్రీనింగ్ కమిటీలు పంపిన లిస్ట్ ఆమోదించిన పీఏసీ
  •     అభ్యర్థులకు బీ ఫామ్ లను అందించిన డీసీసీ లు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 15 పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన స్ర్కీనింగ్ కమిటీలు పంపిన మున్సిపల్ అభ్యర్థుల జాబితాలను సోమవారం పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) ఆమోదం తెలిపింది. దీంతో డీసీసీ అధ్యక్షులకు గాంధీ భవన్ నుంచి బీ ఫామ్ లు పంపించారు. సాయంత్రానికి చాలా జిల్లాల్లో కాంగ్రెస్ అధ్యక్షులు వాటిని అభ్యర్థులకు కూడా అందజేశారు. నామినేషన్ల గడువుకు మంగళవారం చివరి రోజు కావడంతో పార్టీ అభ్యర్థులు అదేరోజు మధ్యాహ్నం లోపు ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు తమ బీ ఫామ్ లను సమర్పించనున్నారు. బీ ఫామ్‌లు సమర్పించిన అభ్యర్థులకు ఎలక్షన్ అధికారులు పార్టీ గుర్తును కేటాయించనున్నారు.

పార్టీ అభ్యర్థులకు బీ ఫామ్ ల పంపిణీ దాదాపుగా పూర్తికావడంతో ఇక టికెట్ దక్కని ఆశావహులను పోటీ నుంచి తప్పించడంపై కాంగ్రెస్ నేతలు దృష్టి పెట్టారు. రెబల్స్ లేకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులను ఆదేశించడంతో బీ ఫామ్ లు దక్కని వారిని బుజ్జగించి రానున్న రోజుల్లో నామినేటెడ్ పదవులు ఇస్తామని హామీ ఇచ్చి పోటీ నుంచి తప్పించే ప్రయత్నంలో మంత్రులు, డీసీసీ చీఫ్ లు, ఎమ్మెల్యేలు ఉన్నారు.