హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీల షెడ్యూల్‌ను ప్రభుత్వం వెంటనే రిలీజ్చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(టీపీయూఎస్) రాష్ట్ర అధ్యక్షుడు వొడ్నాల రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి తెల్కలపల్లి పెంటయ్య గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. జీరో సర్వీస్ నిబంధన అమలు చేస్తే ఎక్కువ మంది టీచర్లు బదిలీ పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం సెన్సస్ విధుల్లోని టీచర్లకూ బదిలీ ప్రక్రియలో పాల్గొనే అవకాశం కల్పించాలని కోరారు.

