V6 News

ఏపీలో ATMలో చోరీ చేసి.. హైదరాబాద్ వస్తుండగా పోలీసుల తనిఖీలు...కారు వదిలేసి దుండగులు పరార్...

ఏపీలో ATMలో చోరీ చేసి.. హైదరాబాద్ వస్తుండగా పోలీసుల తనిఖీలు...కారు వదిలేసి దుండగులు పరార్...

ఏపీలో ఏటీఎం చోరీ చేసి హైదరాబాద్ వస్తుండగా పోలీసులు తనిఖీలు ఉండటంతో కారు వదిలేసి పరారయ్యారు దుండగులు. శనివారం ( ఏప్రిల్ 25 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. ఏపీలో ATMలో చోరీ చేసి హైదరాబాద్ కు వస్తున్నారన్న సమాచారంతో తనిఖీలు చేపట్టారు పోలీసులు. చిట్యాల దగ్గర నేషనల్ హైవేపై తనిఖీలు ముమ్మరం చేశారు.

పోలీసుల తనిఖీలు గమనించిన దొంగల ముఠా కారును చిట్యాల శివారులోని ఓ ప్రైవేట్ వెంచర్ లో వదిలేసి పరారయ్యారు. కారును స్వాధీనం చేసుకున్న నల్గొండ పోలీసులు పరారైన దుండగుల కోసం గాలింపు చేపట్టారు. 

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కారులో సేకరించిన ఆధారాల ద్వారా దుండగుల కోసం గాలిస్తున్నారు పోలీసులు. ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టినట్లు తెలిపారు పోలీసులు.