గండిపేట: రన్నింగ్ కారులో మంటలు

గండిపేట: రన్నింగ్ కారులో మంటలు

గండిపేట, వెలుగు: రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు మరోసారి పెను ప్రమాదాన్ని నివారించారు. పీవీఎన్‌‌‌‌ఆర్ ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌వేపై మెహిదీపట్నం వైపు పిల్లర్ నంబర్ 278 సమీపంలో బుధవారం విధులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఓ రన్నింగ్​కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 

ట్రాఫిక్ పోలీసులు వెంటనే మంటలను ఆర్పివేసి, కారులో ఉన్న వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ ఘటనలో ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ట్రాఫిక్ పోలీసుల అప్రమత్తతను స్థానికులు, ఉన్నతాధికారులు అభినందించారు.