ట్రాఫిక్ పోలీసులూ.. ఇదేం తీరు!.. తిరుమల గిరి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ తీరుపై సోషల్ మీడియాలో పోస్ట్

ట్రాఫిక్ పోలీసులూ..  ఇదేం తీరు!..  తిరుమల గిరి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ తీరుపై సోషల్ మీడియాలో పోస్ట్
  • నానమ్మ, తాతను దవాఖానకు తీసుకువెళ్తున్న ఎన్ఆర్ఐకి ఇబ్బందులు  
  •     కారుకు సైరన్ పెట్టాడంటూ ఫైన్​
  •     ఇంటికి వెళ్లాక కడతా అన్నా పట్టించుకోలే

హైదరాబాద్ సిటీ, వెలుగు : హైదరాబాద్‌‌‌‌లో కొందరు ట్రాఫిక్ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు డిపార్ట్​మెంట్​పైనే అసహనానికి దారి తీస్తోంది. గురువారం తిరుమలగిరిలో జరిగిన ఓ ఘటన ట్రాఫిక్ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు మారాలన్న డిమాండ్​ను లేవనెత్తుతున్నది. ఎన్ఆర్ఐ గౌశిక్ మాండవ ఇటీవలే అమెరికా నుంచి హైదరాబాద్‌‌‌‌ వచ్చారు. గురువారం గౌశిక్​తన తాత, నానమ్మను కారులో డాక్టర్ దగ్గరికి పరీక్షల కోసం తీసుకువెళ్తున్నాడు. అయితే, అతడు సైరన్​వాడడంతో తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్​ఇన్​స్పెక్టర్​సర్ధార్​నాయక్​అతడి వాహనాన్ని ఆపారు. ఫైన్​వేసి వెంటనే కట్టాలని ఇచ్చాడు. 

అయితే, తన నానమ్మ, తాతల ఆరోగ్యం బాగా లేదని, అందుకే సైరన్​వేసి హాస్పిటల్​కు వెళ్తున్నానని చెప్పాడు. తనది తప్పేనని, ఇటీవలే అమెరికా నుంచి వచ్చినందున మొబైల్‌‌‌‌లో గూగుల్ పే, ఫోన్‌‌‌‌పే లేవని, ఇంటికి వెళ్లిన తర్వాత ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో చెల్లిస్తానని చెప్పాడు. ఆలస్యమైతే హాస్పిటల్​లో అపాయింట్​మెంట్​క్యాన్సిల్​అవుతుందని వేడుకున్నాడు. అయినా ఇన్​స్పెక్టర్​ససేమిరా అనడంతో ఫ్రెండ్​కు ఫోన్​చేసి అతడితో ఫైన్​కట్టించాడు.  

అప్డేట్ ​కాలే.. వదలను

చలాన్లు చెల్లించిన తర్వాత కూడా ఇన్​స్పెక్టర్​సర్ధార్​నాయక్​వారిని వదిలిపెట్టలేదు. ‘మీ ఫ్రెండ్​కట్టి ఉంటాడని మాకు ఎలా తెలుస్తుంది. మా సిస్టమ్​లో ఇంకా అప్డేట్ కాలేదు..అప్పటిదాకా పంపించేది లేదు’ అంటూ సమాధానం ఇచ్చాడు. దీంతో మళ్లీ స్క్రీన్ షాట్ తెప్పించుకుని చూపించగా ‘మా యాప్​లో అప్​డేట్​కావాలి.. అప్పటిదాకా వెళ్లేది లేదు’ అని భీష్మించుకు కూర్చున్నాడు.  చివరకు ఓ గంట తర్వాత విడిచిపెట్టాడు. 

సోషల్​ మీడియాలో పోస్ట్​ వైరల్​

ట్రాఫిక్​పోలీసుల తీరుతో తన గ్రాండ్​పేరెంట్స్​అపాయింట్‌‌‌‌మెంట్ మిస్సయిందని బాధితుడు సోషల్​మీడియాలో ఆవేదన వెళ్లగక్కాడు.  వృద్ధులున్న సందర్భాల్లో అయినా పోలీసులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, ప్రజలను గౌరవంగా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆయన సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. బాధ్యులపై విచారణ చేపట్టాలని ట్రాఫిక్ పోలీసు అధికారికి సంబంధించిన ఫొటోను కూడా సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీనిపై  నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తూ ట్రాఫిక్ పోలీసుల తీరును విమర్శిస్తున్నారు.  

దవాఖానకు అని చెప్పలే...

వాహనదారుడు ట్రాఫిక్ పోలీసులతో వాగ్విదానికి దిగాడని, కారులో గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారని.. దవాఖానకు వెళ్తున్నామని కూడా చెప్పలేదని తిరుమలగిరి ట్రాఫిక్ ఏసీపీ శంకర్ రాజు వివరణ ఇచ్చారు. ఈ అంశంపై పూర్తి వివరాలు తెలుసుకుంటున్నామని చెప్పారు.

రివకరీ ఏజెంట్లలా ప్రవర్తించొద్దు..ట్రాఫిక్​ పోలీసులకు హైకోర్టు సూచన

పెండింగ్ చలాన్ల వసూలు కోసం రోడ్డుపై వాహనాలను ఆపి ఆన్‌‌‌‌ది స్పాట్ ఫైన్ వసూలు చేసే అధికారం ట్రాఫిక్ పోలీసులకు లేదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. సామాజిక కార్యకర్త, న్యాయవాది విజయ్ గోపాల్ దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌పై విచారణ జరిపిన జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ ధర్మాసనం పోలీసుల వ్యవహారశైలిని తప్పుబట్టింది. పెండింగ్ చలాన్ల పేరుతో వాహనాలను నడిరోడ్డుపై ఆపి వెంటనే డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేయరాదని కోర్టు ఆదేశించింది. వాహనదారుల నుంచి బైక్ లేదా కార్ తాళాలు బలవంతంగా తీసుకోవడం, గంటల తరబడి రోడ్డుపై నిలిపివేయడం చట్టవిరుద్ధమని పేర్కొంది. 

అలాగే, చలాన్లు పెండింగ్‌‌‌‌లో ఉన్నాయనే కారణంతో వాహనాలను సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని స్పష్టం చేసింది. చలాన్లు చెల్లించని వారిపై కోర్టు ద్వారా నోటీసులు పంపించి చర్యలు తీసుకోవాలని, రికవరీ ఏజెంట్ల మాదిరిగా ప్రవర్తించవద్దని హైకోర్టు సూచించింది. అయితే కోర్టు ఆదేశాలు అమలు కాకపోవడంతో ఇటీవల డీజీపీ, ట్రాఫిక్ జాయింట్ సీపీ సహా పలువురు ఉన్నతాధికారులకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.