బోనాల ఎఫెక్ట్.. నేడు, రేపు సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు

బోనాల ఎఫెక్ట్.. నేడు, రేపు సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని ఈ రోజు, రేపు ఆలయ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. నేటి తెల్లవారుజామున 4 గంటల నుంచి పూజ ముగిసే వరకు పొగాకు బజార్ హిల్ స్ట్రీట్, జనరల్ బజార్ నుండి మహంకాళి ఆలయానికి వెళ్లే రహదారిలో అన్ని వాహనాల రాకపోకలను నిషేధించారు. బాటా క్రాస్ రోడ్ నుంచి ప్రారంభమయ్యే సుభాష్ రోడ్ నుంచి రామ్‌గోపాల్‌పేట్ పోలీస్ స్టేషన్ వరకు హవానాల రాకపోకలను నిషేధించారు. అదవయ్య క్రాస్ రోడ్ నుంచి మహంకాళి ఆలయానికి వెళ్ళే రహదారి, జనరల్ బజార్ నుంచి ఆలయానికి వెళ్ళే రహదారిలో అన్ని వాహనాల రాకపోకలను నిలిపివేశారు.

ఆర్టీసీ బస్సులు ప్రయాణించే మార్గం

  • రైల్వే స్టేషన్ నుంచి ట్యాంక్‌బండ్ వైపునకు తిరిగివచ్చే ఆర్టీసీ బస్సులు ఆల్ఫా హోటల్ క్రాస్ రోడ్ ద్వారా గాంధీ ఆస్పత్రి క్రాస్ రోడ్స్, సజ్జన్‌ లాల్ స్ట్రీట్, ఘాష్‌మండి, బైబిల్ హౌస్, కర్బాలా మైదాన్ మీదుగా ప్రయాణిస్తాయి.
  • సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి తాడ్‌బండ్‌, బేగంపేట వైపు తిరిగి వచ్చే బస్సులను క్లాక్ టవర్, ప్యాట్నీ క్రాస్ రోడ్స్,YMCA క్రాస్ రోడ్, SBH క్రాస్ రోడ్స్ మీదుగా ప్రయాణిస్తాయి.
  • SBH క్రాస్ రోడ్స్ నుండి RP రోడ్ వైపునకు వచ్చే వాహనాలను ప్యాట్నీ క్రాస్ రోడ్స్ దగ్గర మళ్లింపు చేపట్టి క్లాక్ టవర్‌, ప్యారడైజ్ వైపుగా ప్రయాణిస్తాయి.
  • ప్యారడైజ్ నుండి RP రోడ్ వైపుగా వెళ్లే వాహనాలను ప్యాట్నీ క్రాస్ రోడ్స్ దగ్గర మళ్లించి SBH, క్లాక్ టవర్ వైపు ప్రయాణిస్తాయి.
  • జూలై 26న మధ్యాహ్నం 2 గంటల నుండి 10 గంటల వరకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి సెయింట్ మేరీస్ రోడ్ వైపు ఉన్న రహదారి మూసివేయనున్నారు.