చేవెళ్లలో బీజేపీ గెలుపును ఎవ్వరూ ఆపలేరు

చేవెళ్లలో బీజేపీ గెలుపును ఎవ్వరూ ఆపలేరు
  • బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్​రెడ్డి ధీమా
  • శంషాబాద్ నర్కూడ గ్రామంలో విస్తృతంగా ప్రచారం

శంషాబాద్/గండిపేట/చేవెళ్ల,  వెలుగు : మూడోసారి నరేంద్ర మోదీని ప్రధానిని చేసేందుకు దేశం మొత్తం సిద్ధమైందని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్​రెడ్డి చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలతో చేవెళ్ల ప్రజలకు మోదీ చేరువయ్యారన్నారు. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్, ఫసల్ బీమా, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాలు అమలుకాకపోవడంతో జనం ఇబ్బందులు పడ్డారని తెలిపారు. బీజేపీని గెలిపించేందుకు గ్రామాల్లోని బీఆర్ఎస్, కాంగ్రెస్​నాయకులు పార్టీని వీడుతున్నారని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం శంషాబాద్​పరిధిలోని నర్కూడ గ్రామంలో కొండా విశ్వేశ్వర్​రెడ్డి పర్యటించారు.

మాజీ ఎమ్మెల్యే బోడిగె శోభతో కలిసి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమకారుడు ఓ అనుచరుడు టిల్లు ఇంటికి వెళ్లారు.కొండా విశ్వేశ్వర్ రెడ్డి,బిజెపి మాజీ ఎమ్మెల్యే బోడిగే శోభ,విశ్వేశ్వర్ రెడ్డి రాక గురించి తెలుసుకున్న గ్రామస్తులు,యువకులు,మహిళలు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకొని ఆయనను కలిశారు.సార్వత్రిక ఎన్నికల్లో తామంతా భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కొండా విశ్వేశ్వర్ రెడ్డికే ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. 

ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాలుగు కోట్ల మంది ప్రజలను మోసం చేసిందన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందని, ఉనికి కోసమే కేసీఆర్ ప్రచార సభలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. చేవెళ్ల ప్రజలు తన వెంటే ఉన్నారని, ఏ నాయకుడు వచ్చినా చేవెళ్లలో తన గెలుపును ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. విశ్వేశ్వర్​రెడ్డి వెంట నాయకులు డాక్టర్ ప్రేమ్ రాజ్, బుక్క వేణుగోపాల్, బుక్క ప్రవీణ్, సిద్ధులు తదితరులు పాల్గొన్నారు. రాజేంద్రనగర్‌‌ డాన్‌‌ బాస్కోనగర్‌‌లో శనివారం మిల్లెట్‌‌ మార్వెల్స్‌‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మిల్లెట్‌‌ ఎక్స్‌‌పీరియన్స్‌‌ హబ్‌‌ను విశ్వేశ్వర్​రెడ్డి ప్రారంభించారు. అలాగే చేవెళ్ల మండలం ముడిమ్యల గ్రామానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు

సర్పంచ్ శేరి స్వర్ణలత, వార్డు మెంబర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోనె కరుణాకర్ రెడ్డి శనివారం విశ్వేశ్వర్​రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. తన భర్తను గెలిపించాలని కోరుతూ కొండా విశ్వేశ్వర్​రెడ్డి సతీమణి కొండా సంగీతారెడ్డి శనివారం నార్సింగి మున్సిపాలిటీలోని కోకాపేట, రాజపుష్ప, ఫ్రంట్ లైన్, బీఆర్సీ రెసిడెన్సీల్లో, మణికొండలోని కాలనీల అధ్యక్షులతో సమావేశమయ్యారు. విశ్వేశ్వర్​రెడ్డిని మరోసారి లోక్​సభకు పంపాలని కోరారు.