హరోం హర మూవీలో సుధీర్ బాబు డబ్బింగ్ వర్క్‌‌ పూర్తి

హరోం హర మూవీలో సుధీర్ బాబు డబ్బింగ్ వర్క్‌‌ పూర్తి

సుధీర్ బాబు హీరోగా ‘సెహరి’ ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ ‘హరోం హర’.  సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నారు. రీసెంట్‌‌గా షూటింగ్ పూర్తి చేసిన మేకర్స్ పోస్ట్ ప్రొడక్షన్‌‌ను కూడా శరవేగంగా కంప్లీట్ చేస్తున్నారు. తాజాగా సుధీర్ బాబుకు సంబంధించి డబ్బింగ్ వర్క్‌‌ పూర్తయినట్టు  సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు.

‘ఇంగ సెప్పేదేం లేదు, సేసేదే..’ అంటూ తను డబ్బింగ్ చెప్పిన వీడియోను పోస్ట్ చేశాడు.  ‘ఈ కిత మన కుప్పం యాసతో వస్తాండాడు సుబ్రహ్మణ్యం, సూస్కోండా..’ అంటూ ట్వీట్ చేయడం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. 1989 నాటి చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో  సుధీర్ బాబు డిఫరెంట్  క్యారెక్టర్‌‌‌‌లో  కనిపించనున్నాడు. మాళవిక శర్మ హీరోయిన్‌‌. సునీల్, అక్షర గౌడ కీలకపాత్రలు పోషిస్తున్నారు.  చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. మే 31న వరల్డ్‌‌వైడ్‌‌గా సినిమా విడుదల కానుంది.