తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా రేపు (జూన్ 02) సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా వేడుకలు నిర్వహించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు వేడుకల్లో పాల్గొననున్నారు. ఈ క్రమంలో సికింద్రాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
వేడుకల్లో భాగంగా పరేడ్ గ్రౌండ్ చుట్టు పక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని మల్కాజ్ గిరి కమిషనరేట్ పోలీసులు తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి మద్యాహ్నం12 గంటల వరకు పరేడ్ గ్రౌండ్స్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నారు.
బేగంపేట, సంగీత్ జంక్షన్, తిరుమలగిరి, బోయిన్ పల్లి వైపు వెళ్లేవారు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోలని ఈ సందర్భంగా సూచించారు. రోడ్లపై పార్కింగ్ చేయరాదని చెప్పారు. వేడుకల్లో ప్రభుత్వ కార్యవర్గంతో పాటు తెలంగాణ నలుమూలల నుంచి ప్రజానీకం పాల్గొంటున్న సందర్భంగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
ట్రాఫిక్ ఆంక్షలతో పాటు రద్దీ ఎక్కువగా ఉండటంతో.. ప్రయాణీకులు ఆ రూట్లలో మెట్రో ప్రయాణం ఎంచుకోవడం మేలని పోలీసులు సూచించారు. వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చే వారు ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని వాటర్ బాటిల్ క్యారీ చేయాలని సలహా ఇచ్చారు.
