భద్రాచలం - బూర్గంపాడు మధ్య 144 సెక్షన్

భద్రాచలం - బూర్గంపాడు మధ్య 144 సెక్షన్
  • భద్రాచలం - బూర్గంపాడు మధ్య 144 సెక్షన్ 
  • ముందస్తు చర్యల్లో భాగంగా సురక్షిత కేంద్రాలకు ప్రజల తరలింపు
  • భద్రాచలంలో 63 అడుగులకు చేరిన వరద ప్రవాహం

గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఎగువ ప్రాంతం నుంచి గోదావరికి వరద పోటెత్తుతోంది. భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం 63 అడుగుల మేర వరద ప్రవాహం కొనసాగుతోంది. బూర్గంపహాడ్ - భద్రాచలం మధ్య ఉన్న బ్రిడ్జిపై రాకపోకలను నిలిపివేశారు. అలాగే 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. గోదావరి ఉధృతి పెరిగే అవకాశం ఉందన్న హెచ్చరికలతో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారు. స్థానిక వర్షాలతో పాటు ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహం తీవ్రతను  ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. జనాలను అప్రమత్తం చేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లో గస్తీని ముమ్మరం చేశారు.