నేడే ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు

నేడే ఈశాన్య  రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు

ఈశాన్య  రాష్ట్రాలైన  త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌  అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెల్లడికానున్నాయి. ఓటర్లు ఏ పార్టీకి పట్టం కట్టారో మరికాసేపట్లో తెలనుంది.  ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభంకానుంది. ఇప్పటికే ఈసీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గత నెల 16న 60 స్థానలకు త్రిపుర ఎన్నికలు జరగగా 27న మేఘాలయ, నాగాలాండ్‌ లలో ఎన్నికలు జరిగాయి.  ప్రస్తుతం త్రిపురలో బీజేపీ ప్రభుత్వం ఉండగా, మేఘాలయలో నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ… ఎన్‌పీపీ అధికారంలో ఉంది. ఇక నాగాలాండ్‌లో నార్త్‌ ఈస్డ్‌ డెమొక్రటిట్‌ అలయన్స్‌ గవర్నమెంట్‌ కొనసాగుతోంది. ఇక ఈ ఫలితాలతో పాటుగా దేశవ్యాప్తంగా జరిగిన 7 బైపోల్ ఫలితాలు కూడా వెల్లడికానున్నాయి.