
భోజ్‌పురి నటి అన్నపూర్ణ అలియాస్ అమృత పాండే తన అపార్ట్‌మెంట్‌లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె తన గదిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అమృతా పాండే చనిపోవడానికి కొద్దిసేపటి ముందు రాసిన వాట్సాప్ స్టేటస్ పెట్టింది. ప్రస్తుతం తన వాట్సాప్ స్టేటస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భోజ్‌పురి చిత్రాలతో పాటు, అమృత పాండే హిందీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు మరియు టీవీ షోలలో కనిపించింది. సినీ నిర్మాత-దర్శకుడు చింతామణితో విడాకుల అనంతరం అమృత పాండే కొన్ని నెలలపాటు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే ఆమె ఆత్మహత్యకు పాల్పపడినట్లుగా తెలుస్తోంది.
అమృత ఆత్మహత్య కేసులో ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించామని, ఎస్పీ ఆనంద్‌కుమార్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని నగర ఎస్పీ శ్రీరాజ్ తెలిపారు. అమృత పాండే డిప్రెషన్ కు కారణం ఏమిటనేది తెలియరాలేదు. ఇన్విస్టిగేషన్ జరుగుతోంది.