
ప్రముఖ తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్(GV Prakash kumar), ఐశ్వర్య రాజేష్(Aishwarya rajesh) జంటగా వచ్చిన లేటెస్ట్ మూవీ డియర్(Dear).దర్శకుడు ఆనంద్ రవిచంద్రన్(Anand Ravichandran) తెరకెక్కించిన ఈ సినిమా ఏప్రిల్ 11న తమిళంలోకి రాగా శుక్రవారం 12న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
గురక సమస్య ప్రధానంగా వచ్చిన ఈ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. తీసుకున్న పాయింట్ బాగానే ఉన్నా..ప్రెజెంట్ చేసిన విధానం అంతంగా ఆకట్టుకోకపోవడంతో ఆడియన్స్ ఈ సినిమాను రిజెక్ట్ చేశారు.
ఇదిలా ఉంటే..థియేటర్స్ లో విడుదలైన 17 రోజుల్లోనే డియర్ ఓటీటీలోకి వచ్చేసింది. నేడు (ఏప్రిల్ 28) నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది.ఈ సినిమాకి సంబంధించి మేకర్స్ అనుకున్నస్థాయిలో థియేట్రికల్ రన్ లేకపోవటంతో అంచనాల కంటే ముందుగానే ఈ మూవీ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది.థియేటర్లలో సరిగా ఆకట్టుకొని డియర్..ఓటీటీ ఆడియన్స్ ను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
Kaadhal-ah? Korattai-ah? Neenga edha choose pannuvinga? ? ❤️
— Netflix India South (@Netflix_INSouth) April 28, 2024
Watch #DeAr, starring @gvprakash and @aishu_dil, now streaming on Netflix! pic.twitter.com/xYD0RML7jv
కథేంటంటే:
ఒక ఫేమస్ టెలివిజన్ ఛానల్‌లో న్యూస్‌రీడర్‌గా ఉద్యోగం సంపాదించి, ప్రముఖుల్ని ఇంటర్వ్యూ చేయాలన్నదే అర్జున్ (జి.వి.ప్రకాశ్) కల. చిన్నపాటి శబ్దాలకు కూడా నిద్రనుంచి లేచిపోయే సమస్యతో బాధపడుతుంటాడు. మరోవైపు అర్జున్‌కి పూర్తి భిన్నంగా నిద్రలో గురక పెట్టే సమస్యతో బాధపడుతుంటుంది దీపిక (ఐశ్వర్య రాజేశ్). ఈ ఇద్దరూ ఒకరి సమస్య మరొకరికి తెలియకుండా పెళ్లి చేసుకుంటారు. ఆ సమస్యలు వీరి కాపురంలో ఎలాంటి చిచ్చుకు కారణమయ్యాయి? వీరి బంధం నిలబడిందా లేదా? అనే కథ.