తిరుమలలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ.. ప్రముఖ సినీ నటి త్రిష తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం సుప్రభాత సేవలో స్వామి వారిని దర్శించుకున్నారు నటి త్రిష.
తమిళనాడు ఎన్నికల సమయంలో టీవీకే అధినేత సినీనటుడు విజయ్, త్రిష రిలేషన్ షిప్ పై తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. అదే సమయంలో విజయ మొదటి భార్య విడాకుల అంశం తెరపైకి వచ్చింది. ఎన్నికల ప్రచారంలో రచ్చ జరుగుతున్న సమయంలోనే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారుత్రిష.మళ్లీ ఎన్నికల ఫలితాల రోజున త్రిష తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం చర్చనీయాంశంగా మారింది.
