రామన్న చెప్పినా వినరాయే!

రామన్న చెప్పినా వినరాయే!

సిటీలో అడుగడుగునా కేటీఆర్‌ ఫ్లెక్సీలు, హోర్డింగులు

ప్రసన్నం చేసుకునేందుకు గులాబీ నేతలు, కార్యకర్తల ఆరాటం

రూల్స్​కి విరుద్ధమైనా ఫైన్లు వేయని బల్దియా

‘‘నా పుట్టిన రోజు సందర్భంగా కేడర్​, పార్టీ నేతలు ఎవరైనా సరే ఫ్లెక్సీలు, హోర్డిం గులు, పూలబొకేలకు పైసలు ఖర్చు చేయొద్దు. ఆ డబ్బులతో పేదలకు సాయం చేసి వారి ముఖాల్లో చిరునవ్వులు తేవాలి’’.. ఇది కేటీఆర్ తన పుట్టిన రోజు నాడు చేసిన ట్వీట్

హైదరాబాద్, వెలుగు: టీఆర్​ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్​ కొన్ని రోజుల కింద ట్విట్టర్ ద్వారా ఫ్లెక్సీలు, హోర్డిం గులు ఏర్పాటు చేయొద్దని చెప్పినా నేతలు, కార్యకర్తలు, అభిమానులు పట్టిం చుకోలేదు. ‘రామన్న’ దృష్టిలో పడాలంటే ఆ మాత్రం చేయాల్సిందే అంటూ పెద్ద పెద్ద హోర్డిం గులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆయన మంత్రి అయిన తర్వాత అభిమానం మరింత పెరిగింది.

అడుగుకో గులాబీ రంగు ఫ్లెక్సీతో నింపేశారు. పర్మిషన్‌‌ ఉన్న మెట్రో పిల్లర్లతో పాటు హోర్డిం గులు, మెయిన్‌‌ రోడ్ల పక్కన ఎక్కడ  చూసినా ఇవే కనిపిస్తు న్నాయి. చివరికి గోడలను కూడా వదలడం లేదు. రూల్స్‌‌ పాటించకపోతే క్రిమినల్‌ కేసు లు పెట్టాలని స్వయానా మున్సిపల్‌ శాఖ మంత్రి అయిన కె.టి.రామారావు ఆదేశించినా బల్దియా యాక్షన్‌‌ తీసుకోవడం లేదు.

ఫ్లెక్సీలు, హోర్డింగులపై నిషేధం ఉన్నా సిటీలో అడుగడుగునా గులాబీ హోర్డింగులు, ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. టీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ , మంత్రి కేటీఆర్ పార్టీ లీడర్లు, కేడర్ కి ట్విట్టర్ ద్వారా చెప్పినా​ ఎవరూ పట్టించుకోలేదు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా.. మంత్రి పదవి చేపట్టిన తర్వాత విష్ చేస్తూ రోడ్డుకు ఇరువైపులా, మెట్రో పిల్లర్లపైనా ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగులు ఏర్పాటు చేశారు. కొంతమంది నేతలైతే రామన్న చూపు తమవైపు పడితే చాలన్నట్టు ఆకాశాన్ని అంటే హోర్డింగులపై శుభాకాంక్షలు చెబుతూ పక్కన తమ ఫొటోలు కూడా పెట్టుకున్నారు.

బల్దియా నిషేధం ఉన్నా

కోర్టులు ఆదేశించినా, బల్దియా నిషేధించి పెనాల్టీలు విధిస్తామనీ చెప్పినా కొంతమంది నేతలు బేఖాతరు చేస్తూ స్వామి భక్తి చాటుకుంటున్నారు. ప్రచార ఆర్భా టంతో ఇష్టానుసారంగా సైన్ బోర్డులు, వాల్ పోసర్లు, యూని పోల్స్​కు ఫ్లెక్సీలను తగిలించి విధేయత ప్రదర్శిస్తున్నారు. నగరంలో ఉన్న ఏ చిన్న ఖాళీ గోడలు, ప్రచార బోర్డులను వదలకుండా ఫ్లెక్సీలు పెట్టారు . పార్టీ నేతల భజనను మించేలా కొన్ని యాడ్ ఏజెన్సీలు వ్యవహరిస్తున్నాయి. కాస్తా మోతాదు మించినా ఫర్లేదంటూ మెట్రో ఫిల్లర్లు, యూనిపోల్స్, గోడలపై లెక్కకు మించిన ఫ్లెక్సీలు, పోస్టర్లను అతికించాయి.

ఫైన్ వేయని జీహెచ్ ఎంసీ

మెట్రో ఫిల్లర్లు, యూనిపోల్స్​పై ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలంటే జీహెచ్ఎంసీకి పైసలు కట్టాల్సి ఉంటుంది. వాల్ పోస్టర్, వాల్ రైటింగ్ చేస్తే మాత్రం భారీ మొత్తంలోనే జరిమానా ఉంటుంది. సిటీలో హోర్డింగ్ లు, ఫ్లెక్సీల నిషేధం కొనసాగుతున్నా ఈమధ్య ఏర్పాటు చేసిన పొలిటికల్ ఫ్లెక్సీలు, హోర్డింగులను బల్దియా తొలగించడం లేదు. వాటిని ఏర్పా టు చేసిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. వారం రోజుల క్రితం సికింద్రాబాద్, జూబ్లీ హిల్స్ మార్గా ల్లో టీఆర్ఎస్ నేత తలసాని సాయికిరణ్ ఏర్పాటు చేసిన వాల్ పోస్టర్లపై సోషల్ మీడియాలో చర్చ జరిగింది. అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన వాటికి భారీ ఫైన్ ఉంటుం దని, ప్రతి పోస్టర్ రూ.2వేల జరిమానా చెల్లించాలని ఓ నెటిజన్ పోస్ట్​ చేశాడు. దీనికి స్పంద ించిన సాయికిరణ్ గోడలపై వాల్ పోస్టర్లు వేయడం తనకు తెలియదని, అధికారులు ఫైన్ వేస్తే తప్పకుండా కడతానని సమాధానం చెప్పారు. దీనిపైనా విపరీతమైన కామెంట్స్​వచ్చాయి.