ఆగష్టు 24న టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం

ఆగష్టు 24న టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం

టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ సమావేశం మంగళవారం జరగనుంది. ఆగష్టు, 24 మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చించనున్నారు. గ్రామ, మండల, జిల్లా, మరియు రాష్ట్ర శాఖల పునర్నిర్మాణం, అందుకోసం తేదీల ఖరారు తదితర అంశాలపై సమావేశంలో చర్చిస్తారు.

అదేవిధంగా దళితబంధు అమలు విషయంలో పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన పద్దతి, తీసుకోవాల్సిన చర్యలు, పార్టీ చేయాల్సిన కృషిపై నేతలతో చర్చించనున్నారు.