ముషీరాబాద్, వెలుగు: ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఆటోల నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని టీఆర్టీయూ తెలంగాణ ఆటో కార్మిక సంఘం డిమాండ్ చేసింది. బుధవారం సంఘం ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో ఆటోడ్రైవర్ల మహాధర్నా చేపట్టారు. సంఘం ప్రతినిధి రూప్సింగ్ మాట్లాడుతూ.. ఇప్పటికే ఆర్టీసీ మహాలక్ష్మి పథకం వల్ల ఆటో కార్మికుల ఉపాధిపై తీవ్ర ప్రభావం పడిందన్నారు.
కుటుంబాలను పోషించడం ఆటోడ్రైవర్లకు కష్టతరంగా మారిందని పేర్కొన్నారు. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం ఎలక్ట్రిక్ ఆటోలను తీసుకొస్తే ప్రస్తుతం ఉన్న ఆటో కార్మికులు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. ఈ నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని కోరారు.
